Movie News

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి రోజు వరకు అవిశ్రాంతంగా కళకే అంకితమైన ఈ విలక్షణ నటుడు కేవలం యాక్టింగ్ ద్వారానే ఇంత గుర్తింపు తెచ్చుకోలేదు. అదేంటో తెలియాలంటే అయన జీవితంలోని కొన్ని పేజీలు చదవాలి. రాయగడ్ జిల్లా మరాఠి కుటుంబం 1951లో జన్మించిన నానా పటేకర్ జెజె ఇన్స్ టిట్యూట్ అఫ్ అప్లైడ్ ఆర్ట్స్ లో విద్యను అభ్యసించారు. తండ్రి ప్రోత్సాహంతో నాటకాలు చూడటం మొదలుపెట్టి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.

పాతికేళ్లకే ముంబై వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1978 గమన్ రూపంలో తొలి ఆఫర్ తలుపు తట్టింది. పదేళ్ల వరకు సరైన బ్రేక్ దొరకలేదు. 1988 సలామ్ బాంబే అతి పెద్ద మలుపు అయ్యింది. మరుసటి ఏడాది పరిందాలో జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు దక్కాక నానా ప్రతిభ ప్రపంచానికి మరింతగా తెలిసింది. 1991 ప్రహార్ ది ఫైనల్ ఎటాక్ ద్వారా దర్శకుడిగా మారి తనలో మరో సమర్ధతను బయట పెట్టుకున్నారు. రాజు బంగయా జెంటిల్ మెన్, అంగర్, తిరంగా ఇలా వరసగా సూపర్ హిట్లు నానా పటేకర్ మార్కెట్, డిమాండ్ రెండింటిని పెంచాయి.

1994 క్రాంతివీర్ ఆయన జీవితంలోని గొప్ప మైలురాయి. కమర్షియల్ హంగులు లేని ఒక సీరియస్ సినిమాలో ఆవేశంతో ఊగిపోతూ సమాజాన్ని ప్రశ్నించే పాత్రలో నానా పటేకర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చింది. ఆ తర్వాత 1996 అగ్నిసాక్షిలో శాడిస్ట్ భర్తగా నానా నటనకు మహిళలు భయపడ్డారు. ఖామోషిలో చెవిటి తండ్రిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ నభూతో నభవిష్యత్. రెండింటికి జాతీయ పురస్కారం దక్కింది. నానా గొప్పదనం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో మనిషా కొయిరాలానే హీరోయిన్. ఒకదాంట్లో భర్తగా, మరోదాంట్లో నాన్నగా మెప్పించారు.

తొంభై దశకంతో మొదలుపెట్టి దాదాపు పదిహేనేళ్ల పాటు నానా పటేకర్ చాలా బిజీ ఆర్టిస్టుగా ఉన్నారు. పాత్ర నచ్చితే తప్ప రెమ్యునరేషన్ ఎంత ఎక్కువ ఇచ్చినా ఒప్పుకునేవారు కాదు. రజనీకాంత్ కాలాలో విలన్ గా నటించడం ద్వారా మనకూ దగ్గరయ్యారు. అంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో రానా అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించారు. అబ్ తక్ చప్పన్, వెల్కమ్, రాజనీతి, టాక్సీ నెం 9211, వజూద్ ఆయన ఆణిముత్యాల్లో కొన్ని మచ్చుతునకలు. మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ తెలుగులో రంగమార్తాండగా రీమేక్ అయ్యింది.

నానా పటేకర్ 1988 ప్రాంతంలో ఆర్మీలో పని చేశారు. ఆయనకు మేజర్ హోదా ఉంది. 1999 నిజమైన కార్గిల్ యుద్ధంలో తన సేవలు అందించారు. 2013లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ బిరుదును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడే నానా పటేకర్ వ్యక్తిగతంగా సున్నితమైన మనసున్నవాళ్ళని స్నేహితులు అంటారు. తల్లి 99 వయసులో చనిపోయే దాకా కంటికి రెప్పలా చూసుకున్నారు. నానాకు ఇద్దరు మగ సంతానంలో ఒకరే జీవించి ఉన్నారు. భౌతికంగా నానా పటేకర్ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన చెరగని ముద్ర ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. …నానా పటేకర్ మామ

This post was last modified on October 8, 2026 10:34 am

Share

Recent Posts

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

3 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

3 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

10 hours ago