Movie News

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన ఎన్నో వందల సినిమాలను అక్కడ పునర్నిర్మించారు. సోషల్ మీడియాలో ఈ విషయమై ఇతర భాషల వాళ్ల నుంచి కన్నడ ఫిలిం మేకర్స్ మీద కౌంటర్లు పడుతుంటాయి. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి.

కన్నడ నుంచి ఒరిజినల్ ఫిలిం మేకర్స్ పెరుగుతున్నారు. కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలతో ఆ ఇండస్ట్రీకి కూడా మంచి పేరొచ్చింది. పైగా ఇప్పుడు రీమేక్స్ పెద్దగా వర్కవుట్ కావడం లేదన్నది కూడా వాస్తవం. దీంతో ఒకప్పటితో పోలిస్తే కన్నడలో కూడా రీమేక్‌లు తగ్గాయి. ఇలాంటి టైంలో కన్నడ యువ కథానాయకుడు ధ్రువ సర్జా.. ఒక ఫేమస్ తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్నాడనే వార్త చర్చనీయాంశం అయింది.

ఊర మాస్ యాక్షన్ సినిమాలు చేసే ధ్రువ సర్జా.. తాజాగా తన కొత్త సినిమా టీజర్‌తో పలకరించాడు. అందులో అతను ఒక పల్లెటూరిలోకి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి, ఒక పహిల్వాన్‌ను చూడడం.. అతను ఫైట్‌కు రమ్మని రెచ్చగొట్టడం.. దానికి బదులుగా కుటుంబాన్ని గెలిపించడానికి వచ్చాను, ఈ గొడవలేవీ వద్దు అని సైకిలేసుకుని ముందుకెళ్లిపోయి ఒక భారీ భవంతిలోకి వెళ్లడం.. ఇలా సాగింది టీజర్. హీరో సైకిల్ మీద రావడం.. ఇందులో విజువల్స్.. బీజీఎం అన్నీ కూడా మహేష్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’ సినిమాను గుర్తుకు తెచ్చాయి.

దీంతో ఎప్పుడో 11 ఏళ్ల కిందట వచ్చిన పాపులర్ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయడమేంటి.. ఈ కన్నడ ఫిలిం మేకర్స్ మారరా అంటూ తెలుగు వాళ్లు కౌంటర్లు వేస్తున్నారు. కొందరు కన్నడిగులు కూడా రీమేక్ వార్త విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐతే టీజర్ చూసి రీమేక్ అని ఫిక్సయిపోవడం తప్పనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇది ఒరిజినల్ స్క్రిప్టుతో తెరకెక్కిన సినిమానే అని మేకర్స్ చెబుతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీమంతుడు, బృందావనం సహా చాలా తెలుగు సినిమాల ఛాయలు అయితే ఇందులో కనిపించాయన్నది వాస్తవం. ధ్రువతో మన తెలుగు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ సైతం తాజాగా ‘కెమిస్ట్రీ’ అనే సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. అందులో నభా నటేష్ కథానాయిక.

This post was last modified on October 8, 2026 7:21 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

1 hour ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

4 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

4 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

5 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

5 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

10 hours ago