రామ్ చరణ్ ‘ఆచార్య’ కోసం ‘సిద్ధ’ అవతారం ఎత్తి మూడు రోజులే అయింది. ‘ఆచార్య’ సెట్స్‌లోకి అతడికి స్వాగతం పలుకుతూ దర్శకుడు కొరటాల శివ మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న చరణ్ చిత్రాన్ని వెనుక నుంచి షేర్ చేశాడు. ఈ సినిమా కోసం చరణ్ స్పెషల్ లుక్‌లోకి మారినట్లే కనిపించింది ఆ ఫొటో చూస్తే. ఈ సినిమా దేవాలయాల పరిరక్షణ నేపథ్యంలో సాగే సినిమా అని ముందు నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి.
సినిమా చిత్రీకరణ కూడా ఎక్కువగా టెంపుల్ సెట్ నేపథ్యంలోనే సాగుతోందన్నదీ స్పష్టం. చరణ్ క్యారెక్టర్, లుక్ పరంగా ‘ఆధ్యాత్మిక’ కోణం ఉంటుందని తెలుస్తోంది. మొన్న రిలీజ్ చేసిన లుక్ కూడా ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది. కొత్త లుక్ కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి బ్రేక్ తీసుకుని చరణ్ ‘ఆచార్య’ కోసం పని చేస్తున్నట్లే అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఇంతలో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైందని.. సీతారామరాజు, కొమరం భీమ్ కలిసి తమ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. వైరల్ అయిన ఈ ట్వీట్ మెగా అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఈ మధ్యే ‘ఆచార్య’ షూట్‌కు వచ్చిన చరణ్.. ఇంతలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి ఎలా అడుగు పెట్టాడన్నది వాళ్ల డౌట్. క్లైమాక్స్ చిత్రీకరణ అంటే భారీ స్థాయిలోనే ఉంటుంది. నిర్విరామంగా చిత్రీకరణ జరుగుతుంది. కంటున్యుటీ అన్నది చాలా కీలకమైన విషయం. అలాంటపుడు చరణ్ ‘ఆచార్య’ షూటింగ్‌లోనూ ఎలా పాల్గొంటాడన్నది అర్థం కాని విషయం.
‘ఆర్ఆర్ఆర్’ ఏమో వందేళ్ల వెనుకటి నేపథ్యంలో సాగే కథ. ‘ఆచార్య’ వర్తమానం సాగే స్టోరీ. మహా అయితే కొన్నేళ్లు వెనక్కి వెళ్తారు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’లా శతాబ్దం అయితే వెనక్కి వెళ్లే అవకాశం లేదు. అలాంటపుడు ఈ రెండు చిత్రాల్లో చరణ్ ఒకేసారి నటిస్తూ లుక్, కాల్ షీట్స్, ఇతర విషయాల్లో ఎలా మేనేజ్ చేయగలుగుతాడో అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on January 20, 2021 5:27 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…