Movie News

ఆర్ఆర్ఆర్.. ఐతే ఆశలు పెట్టుకోవచ్చు


ఇండియాలో ఈ ఏడాదికి మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’యే అనడంలో మరో మాట లేదు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈపాటికే సినిమా విడుదల కావాల్సింది. ఐతే ఒకసారి షూటింగ్ ఆలస్యం వల్ల సినిమాను వాయిదా వేస్తే.. కరోనా దెబ్బకు ఆ ప్రణాళిక కూడా దెబ్బ తింది. ఆరు నెలలకు పైగా చిత్ర బృందం పని ఆపి కూర్చోవాల్సి వచ్చింది. గత అక్టోబరులో షూటింగ్ పున:ప్రారంభించి విరామం లేకుండా చిత్రీకరణ సాగిస్తున్నారు.

ఐతే ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ రాజమౌళి సినిమా అంటే మళ్లీ మళ్లీ ప్రణాళికలు మారడం, రిలీజ్ వాయిదా పడటం మామూలే. అందులోనూ రామ్ చరణ్‌కు కొంత విరామం ఇచ్చి ‘ఆచార్య’ కోసం పంపించిన నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ మరింత ఆలస్యం కాబోతోందని.. 2021లో ఈ సినిమా విడుదల కాకపోవచ్చని.. 2022 సంక్రాంతికి సినిమాను ఆశించవచ్చని ఒక ప్రచారం నడుస్తోంది ఇండస్ట్రీలో.

ఐతే కరోనా విరామం తర్వాత రాజమౌళి మునుపటితో పోలిస్తే వేగం అందుకున్నాడని.. తక్కువ సమయంలో ఎక్కువ సన్నివేశాలు పూర్తి చేశాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళికి సినిమా ఏ తీరులో నడుస్తుందో.. అదే తరహాలో షూటింగ్ చేయడం అలవాటు. చాలా వరకు కథలో సీనిక్ ఆర్డర్ ఎలా ఉంటుందో అలాగే సన్నివేశాల చిత్రీకరణా సాగుతుందట. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ ఆ పద్ధతినే ఫాలో కాగా.. సినిమాలో కొన్ని చిన్న సన్నివేశాలు మినహాయిస్తే క్లైమాక్స్ ముందు వరకు పూర్తయిందని.. ఇక మిగిలింది పతాక ఘట్టమే అని అంటున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుపెడుతున్న విషయాన్ని జక్కన్న అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం చిత్ర బృందమంతా తమ ఎనర్జీని దాచుకుందని.. ఇక విరామం లేకుండా ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగనుందని.. అటు ఇటుగా రెండు నెలల్లో టాకీ పార్ట్ మొత్తం అయిపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్‌కు వేసుకున్నా.. దసరా సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ను థియేటర్లలో చూసే అవకాశం ఉన్నట్లే. కాబట్టి 2021లోనే ఆర్ఆర్ఆర్ వస్తుందని ఆశలు పెట్టుకోవచ్చన్నమాట.

This post was last modified on January 20, 2021 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

4 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

5 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

6 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

7 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

8 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

9 hours ago