పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు.. ఆ ఫ్యామిలీ బ్రాండును వాడుకోవడం మామూలే. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ తరచుగా తన మావయ్యల రెఫరెన్సులు ఉండేలా చూసుకుంటాడు తన సినిమాల్లో. ఐతే అతడి సమకాలీనుడైన వరుణ్ తేజ్ మాత్రం ఆ బాటలో నడవలేదు.
అతను ‘మెగా’ బ్రాండుకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు మొదట్నుంచి. తనకంటూ సొంత గుర్తింపు కోసమే ప్రయత్నించాడు కానీ.. ఎవరినీ అనుకరించడం కానీ.. చిరు, పవన్ సహా ఏ మెగా హీరో రెఫరెన్సులు పెట్టడం కానీ చేయలేదు.
ఐతే తొలిసారి ఇప్పుడతను తన కొత్త సినిమాకు మెగా టచ్ ఇస్తుండటం విశేషం. వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను వరుణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘గని’ అనే టైటిల్ పెట్టారు.
గని అనగానే మెగా అభిమానులకు ‘బాలు’ సినిమా గుర్తుకొస్తుంది. అందులో పవన్ రెండు పేర్లతో కనిపిస్తాడు. ఒకటి బాలు కాగా.. ఇంకోటి గని. ఢిల్లీలో అతను గని భాయ్‌గానే చలామణి అవుతాడు. ఆ సినిమా సరిగా ఆడలేదు కానీ.. గని పాత్ర అభిమానులపై బలమైన ముద్రే వేసింది. ఇక వరుణ్ చేస్తున్నది బాక్సర్ పాత్ర కావడంతో మెగా అభిమానులకు పవన్ నటించిన మరో సినిమా గుర్తుకొస్తోంది. అదే.. తమ్ముడు. అందులో బాక్సర్ పాత్ర కోసం పవన్ చేసిన సాహసాలను అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగు సినీ పరిశ్రమలోనే బాక్సర్‌గా పర్ఫెక్ట్ అనిపించిన నటుడు పవనే. ఇప్పుడు బాబాయి మెరిసిన పాత్రను వరుణ్ ఎలా పోషిస్తాడో చూడాలి.
ఇక ‘గని’ చిత్రం విడుదలకు జులై నెలను ఎంచుకున్నారు. ఆ నెల మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే. ‘ఇంద్ర’, ‘తొలి ప్రేమ’, ‘మగధీర’, మెగా హీరోల బ్లాక్‌బస్టర్లు వచ్చింది ఈ నెలలోనే. వరుణ్‌కు సైతం జులైలో ‘ఫిదా’ లాంటి బ్లాక్‌బస్టర్ ఉంది. ఇక ‘గని’కి ఉన్న మరో మెగా టచ్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. మెగా ఫ్యామిలీ మెంబర్ నిర్మాణంలో వరుణ్ చేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇలా అనేక రకాలుగా ‘గని’లో మెగా ముద్ర ఉంది.
This post was last modified on January 19, 2021 2:38 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…