కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ప్రభావం కేవలం ఒకటి రెండు భాషలకు పరిమితం కాదు. ఒక్కోసారి దేశాలు దాటిపోతుంది. వాటిలో భగవంత్ కేసరి చేరింది. నిన్న ఇరాన్ ఎంబసీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్రంప్ ని ఉద్దేశించి ఒక వీడియో పెట్టింది. విలన్ల గుంపు ఆయుధాలతో ఎదురుగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ కింద బాలయ్య వాళ్ళ మీద మెషీన్ గన్ ఎక్కుపెట్టి కాల్చేసే క్లిప్ అది. థియేటర్ ఆడియన్స్ ఓ రేంజులో ఎంజాయ్ చేశారు. అనిల్ రావిపూడి మాస్ పల్స్ కి అదో ఉదాహరణగా నిలిచింది.
ఇక్కడ ఇరాన్ ఉద్దేశం ఏమిటంటే ట్రంప్ ఎన్ని కుయుక్తులు, మారణాయుధాలతో వచ్చినా తాము ధీటుగా ఎదురుకుంటామని చెప్పడమే. అందరికీ అర్థం కావడం కోసం హిందీ డబ్బింగ్ వెర్షన్ పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాలకృష్ణ, అనిల్ ఘనత. ఎందుకంటే ఆ ఎపిసోడ్ డిజైన్ చేసిన విధానం, తన ఆరాతో బాలయ్య సింపుల్ అండ్ స్టయిలిష్ బాడీ లాంగ్వేజ్ తో నిలబెట్టిన వైనం బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. అందుకే ఏకంగా ఇరాన్ ఎంబసీ వాడే దాకా వెళ్ళింది.
భగవంత్ కేసరిని విజయ్ తమిళంలో జన నాయకుడుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఎంత దారుణంగా పోయిందో చూసాం. అందులో కూడా ఇలాంటి ఎపిసోడ్ రిపీట్ చేశారు కానీ ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఇంపాక్ట్ ఇందులో కనిపించలేదు. పైగా విజయ్ ఇమేజ్ వల్ల నష్టం తగ్గి వసూళ్లు వచ్చాయి కానీ లేదంటే ఇంకా పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అయ్యేది. ఎన్ని కామెంట్స్ వచ్చినా తన పంథాలోనే సినిమాలు తీస్తున్న అనిల్ రావిపూడికి ఎంబసీ చేసిన ట్వీట్ ఒక మంచి జ్ఞాపకం.
ఇక బాలయ్య విషయానికి వస్తే ఆపరేషన్ తర్వాత విశ్రాంతిలో ఉంటూ త్వరలోనే దాదా సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. డిసెంబర్ 25 విడుదల తేదీ ఫిక్స్ చేసేయడంతో దానికి అనుగుణంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.
బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. దసరా పండక్కు దాదా నుంచి మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉంది. తమన్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates