ఇప్పుడంటే ప్యారడైజ్ యుఫోరియాలో జనం పడిపోయారు కానీ మొన్నటిదాకా ఇండస్ట్రీ హాట్ టాపిక్స్ లో ఒకటిగా నిలిచింది కాకా వర్సెస్ విశ్వంభర. వీటిలో సంక్రాంతికి ఏది వస్తుందనే మీమాంస అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. నిర్మాత దర్శకుడు ఇద్దరూ కాకానే ఫైనల్ అని చెప్పిన తర్వాత కూడా చర్చలు ఆగలేదు. రెండింటి ఓటిటి డీల్స్ అయిపోయాయని, సో పండక్కి రావాల్సిందేనని ఒక వర్షన్, నవంబర్ మూడో వారం వైపు విశ్వంభర చూస్తోందని ఇంకో వర్షన్ వినిపిస్తున్నాయి.
వీటి ప్రొడ్యూసర్ల సంగతలా ఉంచితే అసలు చిరంజీవి మనసులో ఉద్దేశం ఏమిటో అంతు చిక్కడం లేదు. ఎందుకంటే సందర్భం ఏదైనా ఆయన అదే పనిగా కాకా ప్రస్తావన ఒకటే తెస్తున్నారు. ఇటీవలే అభిమానులతో జరిపిన మెగా యూత్ ఫోర్స్ మీటింగ్ లో కదిరి కాళిదాస్ అంటూ కీలకమైన లీక్ ఇచ్చారు తప్పించి విశ్వంభరలో భీమవరం దొరబాబు క్యారెక్టర్ గురించి మాట వరసకు కూడా ప్రస్తావన తేలేదు. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లోనూ ఇదే జరిగింది. ఇకపై కూడా రిపీట్ కానుందేమో.
ఇదంతా చూస్తుంటే ఒక అనుమానం రాక మానదు. అసలు విశ్వంభర ఇప్పటికిప్పుడు రావాలని చిరంజీవికే ఆసక్తి ఉందా లేదాని. ఎందుకంటే ఆల్రెడీ విపరీతమైన ఆలస్యం జరిగిపోయిన ఈ మెగా మూవీని వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే తమకు ఆర్థికంగా బలం వస్తుందని యువి క్రియేషన్స్ భావిస్తోంది. కానీ జరుగుతున్న పరిణామాలు అనుకూలంగా లేవు. రీ రికార్డింగ్ దాదాపు అయిపోయిందని, హరిగౌర ఇచ్చిన బీజీఎమ్ ఓ రేంజ్ లో వచ్చిందని అంటున్నారు.
వీలైనంత త్వరగా ఈ సస్పెన్స్ విడిపోతే బాగుంటుంది. నవంబర్ 20 అంత మంచి ఆప్షన్ కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇది ఫిక్స్ కాలేదు కానీ ప్రతిపాదన ఉందనే సంగతి బయటికి రావడం వాళ్ళను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఆ నెలను సాధారణంగా స్టార్ హీరోలు ఎంచుకోరు. మరి విశ్వంభర అలాంటి రిస్క్ చేస్తుందో లేదో చూడాలి. అసలు ఫౌజీ వదిలేసిన డిసెంబర్ 3 బాగుంటుంది కానీ దానికి ఓటిటి కంపనీ కూడా ఒప్పుకోవాలట. ఈ చిక్కుముళ్లు అంత సులభంగా తేలేలా అయితే లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates