ఈ ఏడాది తెలుగు నుంచి అత్యధిక అంచనాలతో రాబోతున్న సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ‘రంగస్థలం’తో సుకుమార్, ‘అల వైకుంఠపురములో’తో అల్లు అర్జున్ నాన్-బాహుబలి హిట్లు కొట్టాక కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇద్దరి కెరీర్లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ కూడా. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. మధ్యలో బ్రేక్ పడ్డ షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి చిత్ర బృందం ప్రస్తుతం మారేడు మిల్లిలో ఉంది. రేయింబవళ్లు తేడా లేకుండా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
ఇప్పుడు జరిగే షెడ్యూల్ అంతా అయ్యేసరికి సగం సినిమా పూర్తయిపోతుందట. ఐతే ఇప్పటిదాకా ఈ చిత్రానికి విలన్ మాత్రం ఖరారవ్వలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గరే విలన్ పాత్ర ప్రవేశిస్తుందని.. కాబట్టి అప్పటిదాకా విలన్ పాత్రతో పని లేదు కాబట్టి ఇంకా ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలన్నదానిపై ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు.
ఈ షెడ్యూల్ అయ్యే సమయానికి మాత్రం సుకుమార్ ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఇప్పటిదాకా విజయ్ సేతుపతి, బాబీ సింహా, అరవింద్ స్వామి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి ఈ పాత్ర విషయంలో. కాగా ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పేరు తెరపైకి వచ్చింది. పాన్ ఇండియా మూవీ అయిన ‘పుష్ప’ను హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని బాలీవుడ్ విలన్ అయితే బాగుంటుందని యోచిస్తున్నారట.
మరీ పెద్ద నటులైతే బన్నీని డామినేట్ చేస్తారని భావించి మీడియం రేంజిలో బాబీ డియోల్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. విలన్‌ది పోలీస్ పాత్ర అని, ఆ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఐతే ఓ పట్టాన ఏదీ తేల్చని సుకుమార్.. బాబీని కూడా ఒక ఆప్షన్‌గా పెట్టుకున్నాడు తప్ప అతను ఖరారైనట్లు కాదని.. ఆయన మనసులో ఏముందో చిత్ర బృందంలోని వారికి కూడా స్పష్టంగా తెలియదని అంటున్నారు.
This post was last modified on January 18, 2021 7:08 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…