ఒక సినిమా పెద్ద హిట్టయితే.. అందులో లోపాలున్నా సరే, సక్సెస్‌లో కొట్టుకుపోతాయి. టీంలో ఎవ్వరూ వాటి గురించి మాట్లాడరు. సంబరాల్లో మునిగిపోతారు. కానీ దసరా సినిమా విషయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం అలా చేయలేదట. తాను ఆ సినిమాను అనుకున్నంత బాగా తీయలేకపోయానని హీరో నాని దగ్గరికి వచ్చి సారీ చెప్పాడట. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్.. మూడేళ్ల ముందు దసరాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
తొలి చిత్రంతోనే అతను గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టి నానిని టైర్ హీరోల్లో టాప్‌లో నిలబెట్టింది. అతడికి మాస్‌లో రీచ్‌ను పెంచింది. కాకపోతే సినిమా పెద్ద హిట్టయినా సరే.. దసరాలో కొన్ని లోపాలున్నాయన్నది వాస్తవం. టాక్ కొంచెం మిక్స్‌డ్‌గానే వచ్చింది కూడా. ఐతే దసరా పెద్ద హిట్టయింది కదా అని తన వైపు నుంచి జరిగిన తప్పులను కప్పి పుచ్చే ప్రయత్నం చేయలేదట శ్రీకాంత్.
తనతో పాటు అందరం బ్లాక్ బస్టర్ కొట్టామని ఆనందంలో ఉంటే.. శ్రీకాంత్ వచ్చి తాను సినిమా అనుకున్నంత బాగా తీయలేకపోయానని సారీ చెప్పడం తనకు షాకింగ్ అని నాని ది ప్యారడైజ్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కొన్ని సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. అనుకున్నంత బాగా ప్రెజెంట్ చేయలేకపోయానని.. ఇంకా బెటర్‌గా సినిమా తీసి ఉండాల్సిందని శ్రీకాంత్ తనతో చెప్పినట్లు నాని తెలిపాడు.
శ్రీకాంత్ నిజాయితీగా అలా తన లోపాల గురించి మాట్లాడడం తనకెంతో నచ్చిందని, అప్పుడే తర్వాత చేయబోయే సినిమాలో ఇలా జరగకుండా చూసుకుంటానని అనడంతో తెలియకుండానే అతడితో ఇంకో సినిమాకు కమిటైపోయినట్లు అయిందని.. అలా ది ప్యారడైజ్ ప్రయాణం మొదలైందని నాని చెప్పాడు. మరి దసరాలో లోపాలున్నట్లు గుర్తించి నిజాయితీగా ఆ విషయాన్ని నాని దగ్గర ఒప్పుకున్న శ్రీకాంత్.. తన రెండో సినిమా విషయంలో అలాంటి పొరపాట్లు జరగకుండా పర్ఫెక్ట్ సినిమా అందిస్తాడేమో చూడాలి. ది ప్యారడైజ్ వచ్చే గురువారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 18, 2026 3:14 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…