Movie News

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా ఎదిగిన నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా ఇది. దీనిపై ఇతర భాషల ప్రేక్షకుల దృష్టి కూడా నిలిచి ఉంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో కథానాయికగా నటించే అవకాశం కాయదు లోహర్‌కు దక్కింది. ఇప్పటిదాకా చాలా వరకు చిన్న సినిమాల్లోనే నటించిన కాయదుకు ఇది పెద్ద ఛాన్స్ అనే చెప్పాలి.

ఇంత రీచ్ ఉన్న సినిమాలో హీరోయిన్ కావడంతో దీన్ని కెరీర్‌ కోసం ఎలా ఉపయోగించుకోవాలా అని చూడాలి. కానీ ఆమె మాత్రం ఈ సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కనిపించడం లేదు. అసలు ముందు నుంచి టీం ఈ సినిమా ప్రోమోల్లో ఆమెకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా లేటుగా తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తర్వాత ఎక్కడా ప్రోమోల్లో తనకు చోటివ్వలేదు. తాజాగా నానితో కలిసి సిగరెట్ షేర్ చేసుకుంటున్న పోస్టర్ ఒకటి వదిలారు కానీ.. అదేమీ అంతగా ట్రెండ్ అవ్వలేదు.

కొన్ని రోజుల ముందు పెట్టిన హైదరాబాద్ ప్రెస్ మీట్లో కానీ.. లేటెస్ట్‌గా జరిగిన చెన్నై ఈవెంట్లో కానీ కాయదు లేదు. ప్రస్తుతం ఆమె మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కోసం చెన్నైలోనే ఉంది. అయినా ‘ప్యారడైజ్’ ఈవెంట్లో పాల్గొనలేదు. ప్యారడైజ్ ఈవెంట్లకు టీం ఆమెను పిలవట్లేదా.. లేక తనే రావట్లేదా అన్నది క్లారిటీ లేదు. కాయదు చెన్నై ఈవెంట్లో పాల్గొనకపోవడం గురించి నానిని అక్కడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. ఆమె మారి సెల్వరాజ్ సినిమాలో బిజీగా ఉందని, ఆమె తమిళ ప్రేక్షకుల కోసం ఓ మంచి సినిమా చేయాలని అన్నాడు నాని.

తన జవాబు అంత సహేతుకంగా అయితే అనిపించలేదు. కాయదుకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ గుర్తింపుంది. ఇంత పెద్ద సినిమా రిలీజవుతుంటే.. ఒక పూట ఖాళీ చేసుకుని ఈవెంట్లో పాల్గొనలేనంత బిజీగా ఉందా అన్నది సందేహం. చూస్తుంటే.. తనకు సినిమాలో, ప్రమోషన్లలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల కాయదు ఏమైనా హర్ట్ అయిందా.. అందుకే ‘ప్యారడైజ్’ ప్రమోషన్లకు కావాలనే దూరంగా ఉంటోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సినిమాలో తన పాత్రను చూస్తే ఈ విషయంలో క్లారిటీ రావచ్చేమో.

This post was last modified on September 18, 2026 9:19 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

29 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

32 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago