ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న రాజకీయ నాయకుడు అంటే.. విజయే. తమిళనాట నంబర్ వన్ హీరోగా ఎదిగిన ఆయన.. అద్భుతమైన కెరీర్‌ను వదులుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టి.. బరిలోకి దిగిన తొలి ఎన్నికల్లోనే అద్భుత విజయంతో ముఖ్యమంత్రి అయిపోయారు. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తుండగా.. కొన్ని సంచలన నిర్ణయాలతో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్ల కోసం చెన్నైకి వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో నానికి విజయ్ రాజకీయం మీద ప్రశ్న ఎదురైంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ లాంటి సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు కావడం గురించి ప్రస్తావిస్తూ.. రాజకీయ నాయకుడిగా, సీఎంగా విజయ్ పనితీరు ఎలా ఉంది అని నానిని అడిగితే.. నాని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. కేవలం స్టార్ కావడం వల్ల విజయ్ సీఎం కాలేదని.. ఇప్పటిదాకా ఆయన పనితీరు గొప్పగా ఉందని నాని వ్యాఖ్యానించాడు.
‘‘నటులుగా మేం పొందే ప్రేమ మాకు చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. విజయ్ సార్ ఇక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఆయనపై తమిళ జనం చూపించిన నమ్మకం కేవలం ఆయన స్టార్‌డమ్ వల్ల, సినిమాల్లో సాధించిన విజయం వల్ల వచ్చింది కాదు. విజయ్ సార్ ఇక్కడ అత్యధిక కలెక్షన్ రాబట్టే హీరో కాబట్టి ఆయనకు ఓటు వేయలేదు. ఆయన ఎన్నో ఏళ్ల పాటు వాళ్లను అలరిస్తూ తమ కుటుంబంలో ఒకడనే భావన కలిగించారు. కేవలం స్టార్‌డమ్, బాక్సాఫీస్ కలెక్షన్ల ద్వారా కాకుండా అనేక కారణాలతో ఆయన జనంలో ఒక నమ్మకం సంపాదించారు. అందుకే ఆయన్ని ఎన్నుకున్నారు.
రాబోయే కొన్నేళ్లలో విజయ్ సార్ పరిపాలన గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా. తమిళ ఓటర్ల నిర్ణయం సరైందే అని రుజువు చేస్తారనుకుంటున్నా. ఇప్పటిదాకా ఆన్ లైన్లో నేను చూసిన విషయాలు, అసెంబ్లీ సెషన్స్ తాలూకు వీడియోలు గమనిస్తే ఆయన అద్భుతంగా పని చేస్తున్నట్లు అనిపిస్తోంది’’ అని నాని చెప్పాడు. ‘ది ప్యారడైజ్’ ఈ నెల 24న తెలుగుతో పాటు పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 18, 2026 2:27 pm
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…