గత పాతికేళ్లలో ఎప్పుడూ అనుభవించని విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి చవి చూస్తున్న మాట వాస్తవం. సంక్రాంతికి కాకా విడుదల చేయాలనే సంకల్పంతో దర్శకుడు బాబీ కొల్లి ఒక యజ్ఞంలా షూటింగ్ చేస్తున్నారు. నిర్మాత కెవిఎన్ బయట జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు మెగాస్టార్ ని కలిసిన ఫోటో ఒకటి పెట్టి మరీ ఫస్ట్ ఆడియో సింగల్ కమింగ్ సూన్ అన్నారు. ఇంకోవైపు విశ్వంభర కూడా పండక్కి రావాలని, ఆ మేరకు ఓటిటి ఒప్పందం చేసుకుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది.
ఈ నేపథ్యంలో చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఒక ట్వీట్ చేశాడు. లయకారుడు శివుడిని ఉద్దేశించి ” శ్వాస నాది, శాసనం నీది ఆశ నాది, పాశం నీది, ఆత్మ నాది, ఆట నీది…ఎంత మాయగాడివయ్యా, ఓం నమః శివాయ, ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది, సర్వం శివం, ఓం నమః శివాయ ” అంటూ మెసేజ్ పెట్టాడు. కింద చాగంటి వారి వీడియోని జోడించి అంతా శివయ్య చూసుకుంటాడు, ఆయన తలుచుకుంటే జరిగిపోద్ది అనే ఉద్దేశంలో ఇది పెట్టినట్టుగా కనిపిస్తోంది
దీన్ని బట్టి విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో జరుగుతున్న సర్కస్ నిజమే అని అర్థమైపోతోంది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ కావడమే న్యాయమని న్యూట్రల్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే విడుదల ఇప్పటికే రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. టీజర్ మీద వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ఏకంగా ఇంత విలువైన కాలాన్ని విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు పెట్టేలా చేసింది. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ఇలా నలిగిపోతూ రావడం సగటు సినీ ప్రియులను కలవపరిచింది.
ఇప్పుడీ సమస్యకు ఫైనల్ కంక్లూజన్ ఏంటనేది అంతు చిక్కడం లేదు. ఒకవేళ సంక్రాంతికి రెండు చిరంజీవి సినిమాలు రిలీజ్ చేద్దామా అంటే అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. అసలే పోటీ వల్ల థియేటర్ల కొరత వస్తుందని బయ్యర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ అసాధ్యం. సో విశ్వంభర అయితే నవంబర్ లేదా డిసెంబర్, కుదరకపోతే వేసవికి వెళ్ళాలి. కానీ వశిష్ఠ నర్మగర్భంగా చెబుతున్న దాని ప్రకారం విశ్వంభర నుంచి ఏదో షాక్టింగ్ అప్డేట్ అయితే రానుంది.
This post was last modified on September 18, 2026 10:39 am
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…