వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది నిర్ణయం చిరంజీవికే వదిలేశారనే టాక్ వచ్చింది. చూస్తుంటే తీర్పు కాకాకే అనుకూలంగా వచ్చినట్టు కనిపిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ అఫీషియల్ హ్యాండిల్ లో వెంకట్ నారాయణ్ తో పాటు యువి విక్రమ్ కూడా ఉన్న ఫోటో పెట్టేసి కాకా జనవరి 13 విడుదలవుతుందని, త్వరలో మొదటి ఆడియో సింగల్ వస్తుందని చెప్పేశారు.
సో పండక్కు విజువల్ గ్రాండియర్ చూద్దామనుకున్న ఫ్యాన్స్ ఆశలు నెరవేరడం లేదు. అయితే విశ్వంభర ముందు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఫౌజీ ఎలాగూ రావడం లేదు కాబట్టి డిసెంబర్ మొదటి వారం స్లాట్ ని లాక్ చేసుకోవడం వాటిలో ప్రధానమైంది. వేరే రిలీజులు ఉన్నా స్కేల్ పరంగా కాంపిటీషన్ అనిపించేది నాగచైతన్య వృషకర్మ ఒకటే. మరి మెగాస్టార్ వస్తారంటే యువ సామ్రాట్ తగ్గుతాడో లేక క్లాష్ అయినా పర్లేదనుకుని ముందుకెళ్తారో వేచి చూస్తే కానీ క్లారిటీ రాదు.
ఒకవేళ విశ్వంభరకు డిసెంబర్ ఫస్ట్ వీక్ సాధ్యం కాకపోతే 2027 వేసవికి వెళ్లిపోవచ్చు. ఆ టైంలో ప్లాన్ చేసుకున్న డ్రాగన్ లాంటివి మళ్ళీ వాయిదాలు తీసుకునేలా ఉన్నాయి. సో సమ్మర్ లో సరైన డేట్ కనక పట్టుకుంటే రికవరీ అవకాశాలు పెరుగుతాయి. ఇదీ వద్దనుకుంటే ఫిబ్రవరిని ఎంచుకోవచ్చు. ఇదంతా ముందే గుర్తించి నిన్న అడివి శేష్ టీమ్ తమ గూఢచారి 2 ఫిబ్రవరి అయిదు వస్తుందని చెప్పేసింది. ఇలా ఒక విడుదల తేదీ వెనుక ఎన్నో క్యాలికులేషన్లు ఉంటాయి.
సరే విశ్వంభర ఎప్పుడు వస్తుందనేది పక్కన పెడితే ప్రమోషన్లను మళ్ళీ ఫ్రెష్ గా మొదలుపెట్టాలి. ఆల్రెడీ బజ్ దాదాపు జీరో అయిపోయింది. రాముడి మీద ఒక పాట వదిలిన సంగతే జనాలు మర్చిపోయారు. కొత్త టీజర్ వచ్చి ఏడాది దాటిపోయింది. సో హైప్ పెరగాలంటే ఎక్స్ ట్రాడినరి అనిపించే విజువల్స్ తో పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి. కాకా కన్నా ముందా లేక తర్వాతా అనేది పక్కనపెడితే ముందైతే విశ్వంభర ప్రచారాన్ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates