అవును, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు నచ్చరట. ఈ విషయాన్ని ఎపిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో సందీప్ స్వయంగా చెప్పాడు. కాకపోతే అది సరదాగానే. ఎపిక్ మూవీలో లీడ్ క్యారెక్టర్ల గురించి అభివర్ణిస్తూ శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో లాంటి కథానాయకుడు, సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోల్లాంటి హీరోయిన్ అని అభివర్ణించడం గురించి యాంకర్ సుమ.. సందీప్ రెడ్డి అభిప్రాయం అడిగింది.
దానికి ఆయన మాట్లాడుతూ.. ”నాకు శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలు నచ్చరు బేసిగ్గా” అని బదులిచ్చాడు. ఐతే కమ్ముల సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లు మాత్రం బాగా నచ్చుతారని చెప్పాడు. ఎపిక్ సినిమాలో హీరోయిన్ పాత్రను తన సినిమాల్లో హీరోలతో పోల్చడం మస్త్ అనిపించిందని సందీప్ వ్యాఖ్యానించాడు.
ఇక తన ప్రసంగంలో హీరో ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. అతను యుఎస్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న రోజులను గుర్తు చేసుకున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి రిలీజ్ టైంలో దాన్ని డిఫరెంట్‌గా ప్రమోట్ చేయడం కోసం తాను, విజయ్ కలిసి అమెరికాకు వెళ్లామని, అక్కడ పాట రిలీజ్ చేయాలని ప్లాన్ చచేశామని సందీప్ చెప్పాడు. అప్పుడు తన అన్నయ్య ప్రణయ్ అక్కడుండేవాడని.. విజయ్ తమ్ముడు ఆనంద్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాడని.. తమ కోసం కాలిఫోర్నియా నుంచి డాలస్‌కు వచ్చాడని తెలిపాడు సందీప్.
అప్పుడు కొన్ని రోజుల పాటు తమతోనే ట్రావెల్ చేశాడని.. తమ సినిమా డిస్కషన్లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడని.. అప్పుడు తన సినిమా పిచ్చి చూసి, మనలాగే ఉన్నాడు, మరి ఇలా జాబ్ ఎలా చేస్తున్నాడు అని తాను ఆశ్చర్యపోయానని.. కట్ చేస్తే కొన్నేళ్లకు దొరసాని సినిమాతో హీరో అయిపోయాడని సందీప్ అన్నాడు. ఈ ఆరేళ్లలో ఆనంద్ మంచి సినిమాలే చేశాడని.. తన జర్నీ తనకు నచ్చిందని సందీప్ చెప్పాడు. నైంటీస్ వెబ్ సిరీస్ రైటింగ్ చూస్తే ఫస్ట్ డైరెక్టర్‌లా అనిపించలేదని, ఎంతో మెచ్యూరిటీ చూపించాడని సందీప్ కొనియాడాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates