లేడీ కనక మాయ చేస్తే హిట్టు పడ్డట్టే

రేపు, ఎల్లుండి తేదీల్లో వరసగా టాలీవుడ్ బాక్సాఫీస్ మీదకు ఏడుకి పైగా సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి లేకపోయినా కంటెంట్, సెలబ్రిటీ బ్యాకప్, పబ్లిక్ టాక్ నమ్ముకుని బరిలో దిగుతున్నాయి. వాటిలో మాయలేడి ఉంది. బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా నటించిన ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ లో మధుమిత హీరోయిన్ గా నటించగా ఫౌజికి పని చేస్తున్న విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ వచ్చి జనాల దృష్టిలో అయితే పడింది.

కథను తెలివిగా చెప్పీ చెప్పనట్టు రివీల్ చేశారు. ఒక కుర్రాడు ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే హఠాత్తుగా ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చేసి అపరిచితురాలిగా అతను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. కాసేపటికి మళ్లీ మాములు అవుతుంది. అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను లవ్ చేసిన యువతి ఒకరు కాదు ఒకే పోలికతో ఉన్న ఇద్దరిని అర్థమవుతుంది. ఆలోగా చాలా ట్విస్టులు జరిగిపోతాయి. మరి నిజంగా వాళ్ళు కవలలా లేక ఇంకేదైనా వేరే మలుపు ఉందానేది తెరమీద చూడాలి.

కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి వాటిలో వినోదాన్ని సరిగ్గా పండిస్తే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. దర్శకుడు ప్రశంకర్ ఆ నమ్మకాన్నే వ్యక్తం చేస్తున్నారు. కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉన్నా తమ సినిమా చూశాక పబ్లిక్ వాళ్లే ముందుకు తీసుకెళ్తారని, నవ్వించడంతో పాటు థ్రిల్ చేసే ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయని హామీ ఇస్తున్నాడు. టైటిల్ బట్టే ఇందులో సర్ప్రైజులు చాలా ఉంటాయని అర్థమవుతోంది. కమెడియన్ సత్య, ఇంద్రజ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది

ఒకవేళ మాయలేడి కనక మాయ చేస్తే హిట్టు నమోదు చేసుకోవచ్చు. రామాయణ పార్ట్ 1, సీన్ రెండో వారంలో కూడా మంచి రన్ కొనసాగించబోతున్నాయి. ఇట్లు అర్జున, డార్క్ చాకొలేట్ లాంటి ఇతర బడ్జెట్ సినిమాల నుంచి మాయ లేడీకి టఫ్ కాంపిటీషన్ ఉంది. థియేటర్లు పంచుకోవడం దగ్గరి నుంచి షోలు పడి ప్రేక్షకులతో బాగుందనిపించుకునే దాకా అందరికి టెన్షన్ తప్పదు. దీనికి నిర్మాత కూడా రాకేష్ వర్రే కావడం విశేషం. ఎలాంటి వర్రీ లేకుండా విజయం సాధిస్తామనే ధీమా తనలో ఉంది.