Movie News

ఇప్పటిదాకా ‘మనం’ చూడని సుమంత్

మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులో మూడు తరాల అక్కినేని హీరోలు అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున-నాగచైతన్య కలిసి నటించారు. అఖిల్ కూడా ఒక క్యామియో చేశాడు. ఏఎన్నార్‌కు ఇదే చివరి చిత్రం. అద్భుతమైన కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఐతే ఇంత గొప్ప సినిమాను అక్కినేని కుటుంబంలో ముఖ్యుడైన సుమంత్ ఇప్పటిదాకా చూడలేదట.

ఏఎన్నార్‌ పెద్ద మనవడు, ఆయనకు ఎంతో ఇష్టమైన సుమంత్.. తన తాత చివరి చిత్రాన్ని చూడకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఇందుకు ఒక బలమైన కారణం ఉందంటున్నాడు సుమంత్. తన తాత చివరి దశలో చాలా ఇబ్బంది పడుతూ చేసిన సినిమా ఇదని.. ఆ సినిమా చూస్తే తనకు ఆయన చివరి రోజులే గుర్తుకొచ్చి చాలా బాధ కలుగుతుందని, అందుకే ఆ సినిమా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు సుమంత్.

‘మనం’ సినిమా చూసేందుకు ఒకట్రెండు సార్లు ప్రయత్నించానని.. కానీ తాత ఆరోగ్య పరంగా బాగా ఇబ్బంది పడ్డ చివరి దశ గుర్తుకు వచ్చి, ఆయన మరణం తాలూకు బాధ కూడా వెంటాడి సినిమాను కొనసాగించలేక ఆపేశానని సుమంత్ తెలిపాడు. ‘మనం’ సినిమాను తాత ఎంత ఇబ్బంది పడుతూ పూర్తి చేశాడో తనకు తెలుసని సుమంత్ చెప్పాడు. అప్పటికి క్యాన్సర్ చివరి దశకు చేరిందని.. ఆ సినిమాలో నటించడానికి, డబ్బింగ్ చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారని అతనన్నాడు.

ఐతే నటిస్తూనే చనిపోవాలన్నది ఆయన కోరిక అని.. దాదాపుగా అదే జరిగిందని, ఆ సినిమాకు పని చేస్తూ ఆయన మరణానికి అత్యంత దగ్గరగా వెళ్లారని సుమంత్ చెప్పాడు. ఇంటికి దగ్గర్లోనే ఉన్న స్టూడియోకు వెళ్లి కూడా డబ్బింగ్ చెప్పలేని పరిస్థితుల్లో ఇంట్లోనే డబ్బింగ్ ఏర్పాట్లు చేశామని.. అక్కడ కూర్చుని అతి కష్టం మీద డైలాగులు చెప్పారని సుమంత్ గుర్తు చేసుకున్నాడు.

ఒకసారి షూట్ చేస్తుండగానే చాలా సీరియస్ అయి ప్రాణం మీదికి వచ్చిందని.. సర్జరీ చేసి ఇంకొన్ని రోజులు ఆయన జీవిత కాలాన్ని పొడిగించారని.. ఒకవేళ అప్పుడాయన చనిపోయి ఉంటే మనం సినిమానే ఆగిపోయేదని సుమంత్ తెలిపాడు. ఇవన్నీ చూశా కాబట్టే ‘మనం’ సినిమా చూస్తే ఆయన బాధ గుర్తుకు వచ్చి ఆ సినిమాను పూర్తి చేయలేకపోయానన్నాడు సుమంత్.

This post was last modified on September 9, 2026 3:18 pm

Share

Recent Posts

రామ్‌చరణ్ రావడం అర్జునకి ప్లస్సవుతుందా

ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్…

1 hour ago

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…

2 hours ago

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…

2 hours ago

మంగళవారం వచ్చినా మోత తగ్గడం లేదే

రామాయణ పార్ట్ 1 వసూళ్లు కొత్త చరిత్ర రాస్తున్నాయి. మొదటి వారం కాకుండానే 700 కోట్ల వైపు పరుగులు పెడుతున్న…

2 hours ago

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

4 hours ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

4 hours ago