Movie News

బ్రిటిషర్ల తలలతో ‘ రణబాలి’ రక్తాభిషేకం

హిట్టు ఫ్లాపు సంగతి ఎలా ఉన్నా తన సినిమా వస్తోందంటే అభిమానులు, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కలిగేలా చేసే విజయ్ దేవరకొండ రణబాలి అక్టోబర్ 16 విడుదలకు రెడీ అవుతోంది. పెళ్ళయాక రష్మిక మందన్నతో చేసిన మొదటి మూవీ కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ తో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇవాళ టీజర్ లాంచ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో ఐడియా ఇచ్చారు.

1878 సంవత్సరం. రాయలసీమలోని ఒక మారుమూల ప్రాంతం. అన్నపూర్ణగా పేరున్న ఊరిలో అన్నం మెతుకులకు దేహి అనే పరిస్థితి వస్తుంది. కారణం బ్రిటిషర్ల దుర్మార్గ పాలన. పెత్తనం పేరుతో ఒక అధికారి (ఆర్నాల్డ్ ఓస్లో) చేస్తున్న అరాచకాలకు వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. అప్పుడు వస్తాడు సింగనమల రణబాలి (విజయ్ దేవరకొండ). తెల్ల దొరల తలలను తెంపుతూ రక్తంతో అభిషేకం చేసి తన వాళ్లకు తిండి కల్పిస్తాడు. ఆ పోరాట గాథ ఏంటో వచ్చే నెల తెలియనుంది.

దర్శకుడు రాహుల్ సంక్రుత్యన్ విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించిన తీరు, ఆర్ట్ వర్క్ ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో గతంలో సైరా లాంటి సినిమాలు వచ్చినప్పటికీ రణబాలి డెప్త్ చాలా విభిన్నంగా ఉంది. ముఖ్యంగా మమ్మీ సిరీస్ తో మనకు బాగా దగ్గరైన ఆర్నాల్డ్ ఓస్లోని మెయిన్ విలన్ గా చూడటం నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తుంది. అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం టెక్నికల్ గా ఉన్నంతగా ఉంది.

అంచనాలు పెంచడంలో రణబాలి బృందం విజయవంతమయ్యింది. సీమ యాసతో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని రీతిలో ఇంత మాస్ గా చూపించడం అభిమానులకు స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. రష్మిక మందన్నని కేవలం ఒక్క షాట్ లో మాత్రమే రివీల్ చేశారు. టీజర్ రెండున్నర నిమిషాల దాకా చూపించారంటే ఇక ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. దసరా కానుకగా విడుదల కాబోతున్న రణబాలికి పోటీగా జైలర్ 2 ఉంది. పండగ రోజు మూవీ లవర్స్ మంచి విందు సిద్ధమవుతోంది.  

This post was last modified on September 9, 2026 5:40 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

44 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

3 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

3 hours ago