ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు ఒన్ రిలీజ్ కు వెళ్లడం బయ్యర్ వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. ట్రైలర్ వచ్చాక బిజినెస్ ఎంక్వయిరీలు బాగా జరిగిన ఈ మూవీ, హీరో సుమంత్ కి మరో కంబ్యాక్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఇది సుమంత్ ఒక్కడికే కాదు సిద్దు జొన్నలగడ్డకు కూడా కొంతవరకు కీలకం కానుంది.
ఎందుకంటే ఇందులో సిద్ధూ క్యామియో చేసిన సంగతి తెలిసిందే. తన పాత్ర గురించి కొన్ని డీటెయిల్స్ ట్రైలర్ లో చూపించారు కానీ అసలు సినిమాలో వేరే లెవెల్ ఉంటుందని, ఉన్నది పరిమిత నిడివే అయినా మంచి ఎలివేషన్స్ పడ్డాయని అంటున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్, వారాహి అమ్మవారి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ, ఫాంటసీ, ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ వగైరాలు ఊహించని స్థాయిలో బాగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే కమర్షియల్ గా మంచి ఫుల్ ఉంటుంది.
గతంలో క్యాస్టింగ్ లేకుండా తక్కువ అంచనాలతో మా ఊరి పొలిమేర 2 లాంటివి కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. మహేంద్రగిరి వారాహిలో హారర్ బదులు డివోషనల్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఆదరణ ఉంటుందనే కాన్ఫిడెన్స్ పని చేసిన వాళ్లలో కనిపిస్తోంది. సిద్దు గతంలో రవితేజ మిస్టర్ బచ్చన్ చిన్న గెస్ట్ రోల్ చేశాడు. బొమ్మ డిజాస్టర్ కావడం వల్ల తనకు ప్రయోజనం, గుర్తింపు రెండూ దక్కలేదు. ఈసారి అలా కాకూడదని ఫ్యాన్స్ కోరిక.
సుబ్రమణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎపిక్, సర్దార్ 2, మండాడి, మారెమ్మ రూపంలో మంచి కాంపిటీషన్ స్వాగతం పలుకుతోంది. ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్లకు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని ఇరుముడి నిరూపిస్తే ఉత్తుత్తి హంగులకు తిరస్కారం తప్పదని టాక్సిక్ సాక్ష్యంగా నిలిచింది. మరి మహేంద్రగిరి వారాహి కూడా సక్సెస్ లిస్టులో చేరుతుందో లేదో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది. ముందు రోజు ప్రీమియర్లు వేసే ప్లానింగ్ జరుగుతోందట.
This post was last modified on September 8, 2026 5:20 pm
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…