Movie News

బుచ్చిబాబు ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయంటే

పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి మీద కాసిన్ని ముచ్చట్లు చెప్పేసి మాయమైపోవడం తప్పించి మీడియాకు అందుబాటులోకి వచ్చి నెలలు గడిచిపోయాయి. పెద్ది టైంలో వచ్చిన భారీ వసూళ్ల కన్నా విమర్శలే తనని బాగా బాధించాయని సన్నిహితుల మాట. హీరోయిన్ పాత్రని కావాలని టార్గెట్ చేసి ఇతర విషయాలను హైలైట్ కానివ్వకుండా ట్రోలింగ్ చేయడం ఇతర భాషల్లో నెగటివ్ ఫలితాన్ని ఇచ్చిందని అంటున్నారట.

దీని సంగతలా ఉంచితే పెద్ది తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనేది వాస్తవం. దీంతో పాటు చరణ్ కన్నా ఎక్కువగా చిరంజీవిని పెద్ది మెప్పించిందనేది కూడా నిజం. ఇలాంటి విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ సినిమా రాసుకున్న తీరు మెగాస్టార్ ని ఆకట్టుకుందట. కాకపోతే క్లైమాక్స్ లో ఎమోషన్ మరీ అంత ఎక్కువైపోవడం ఉత్తరాది, ఓవర్సీస్ జనాలకు నచ్చదనే విషయం ఆయన కూడా గుర్తించలేదట. అందుకే బుచ్చిబాబు మీద నెగటీవీ ఒపీనియన్ లేదనేది ఇన్ సైడ్ టాక్.

ప్రస్తుతం బుచ్చిబాబు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం వెతికితే చిరంజీవి కోసమే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈసారి శరీర భాగాల త్యాగాలు, సందేశాలు, ఉపదేశాలు లేకుండా ఫక్తు కమర్షియల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని వినికిడి. ఒకవేళ చిరంజీవికి నచ్చితే గ్రీన్ సిగ్నల్ వస్తుంది. లేదంటే ఇంకో స్టోరీ చెప్పడమో, వేరే హీరోని వెతుక్కోవడమో చేయాలి. చిరు మాత్రం ఉప్పెన, పెద్ది వర్క్ నచ్చబట్టే బుచ్చిబాబు పట్ల సానుకూలంగా ఉన్నారని, ఈ కాంబో ఉంటుందని లీక్ చెబుతోంది.

కాకా షూటింగ్ అయ్యాక విశ్వంభర విడుదల వ్యవహారం చిరంజీవి తేల్చాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా సెట్స్ పైకి వెళ్తుందా లేదానేది ఇంకా బయటకి రావడం లేదు. ప్యారడైజ్ ఫలితం తేలాక దీనికి సంబంధించిన మూమెంట్ ఉండొచ్చు. వెంకీ అట్లూరి కూడా ఆసక్తిగా ఉన్నారు కానీ ఆయన దగ్గర ప్రస్తుతం లైన్ అయితే లేదట. సెట్ అయితే మటుకు నాగవంశీని తీసుకుని చిరు దగ్గరికి వెళ్ళిపోతారు. చూడాలి మెగా 159 ఎవరికి రాసిపెట్టి ఉందో, ఎవరు చేయబోతున్నారో.  

This post was last modified on September 8, 2026 5:25 pm

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

31 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

37 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

48 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

1 hour ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago