అల్లు వారి ఆహా ఓటీటీ దూకుడు మీదుంది. తెలుగులో ఈ ఓటీటీ లాగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను మరే ఫ్లాట్ ఫామ్ కూడా రిలీజ్ చేయట్లేదు. ప్రతి వారం కొత్త కంటెంట్ ఇస్తూ సబ్‌స్క్రైబర్లను నిలుపుకోవడానికి, పెంచుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఆహా.
సంక్రాంతి కానుకగా ఆహాలో మెయిల్ అనే చిన్న సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వస్తోంది. వచ్చే వారానికి కూడా ఆహా ఓ కొత్త సినిమాను రెడీ చేసేసింది. ఆ సినిమా పేరు.. సూపర్ ఓవర్. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను పూర్తి చేసేసింది చిత్ర బృందం. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగస్వాములు అయ్యారు.
నవీన్ చంద్ర, చాందిని చౌదరి, అజయ్ సూపర్ ఓవర్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆయన శిష్యుడు ప్రవీణ్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీని స్నీక్ పీక్‌ను హీరో శర్వానంద్ తాజాగా రిలీజ్ చేశాడు. ఒక భారీ దొంగతనం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు కుర్రాళ్లు, ఓ అబ్బాయి కలిసి పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లోనే దొంగతనానికి ప్రణాళిక రచిస్తారు.
రిస్క్ చేస్తే తప్ప డబ్బులు రావని భావించిన హీరో తన ప్రేయసి, ఓ ఫ్రెండుతో కలిసి ఈ దొంగతనానికి సిద్ధపడతాడు. వాళ్ల ప్రణాళిక ఏంటి.. వీరికి పోలీసులు ఎలా అడ్డు పడ్డారు.. చివరికి ఎవరు పైచేయి సాధించారన్నది మిగతా కథ. సుధీర్ వర్మకు హీస్ట్ థ్రిల్లర్లంటే ఇష్టం. అతడి డెబ్యూ మూవీ స్వామి రారా, తర్వాతి సినిమా దోచేయ్ కూడా ఆ తరహావే. ఇప్పుడు అతడి శిష్యుడు కూడా ఆ తరహా సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి ఈ సూపర్ ఓవర్ ప్రేక్షకులను ఏమేర అలరిస్తుందో చూడాలి.
This post was last modified on January 17, 2021 11:06 am
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఒక ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. ఇప్పటి…
ట్రెడిషనల్ హీరోయిన్గా ముద్ర పడ్డ ఐశ్వర్యా రాజేష్ లాంటి హీరోయిన్ల గురించి ఎఫైర్ రూమర్లు రావడం అరుదు. ఐశ్వర్య ఫలానా…
ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు…
గత ఏడాది అమరన్ రూపంలో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి త్వరలో ప్రభాస్ తో…
ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్ డ్రైవింగ్.. తదితరాలపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి…