Movie News

అయ్య‌గారు ట్యాగ్ త‌న‌దంటున్న ఆ హీరో

అక్కినేని కుటుంబం నుంచి చివ‌ర‌గా హీరో అయిన అఖిల్‌కు అభిమానులు ప్ర‌త్యేకంగా ఏ బిరుదూ ఇవ్వ‌లేదు. కానీ అనుకోకుండా అత‌డి పేరు వెనుక అయ్య‌గారు అనే ట్యాగ్ వ‌చ్చి చేరిపోయింది. ఇదంతా నాగ‌రాజు అనే ఒక వీరాభిమాని పుణ్య‌మే. గ‌తంలో ఎప్పుడో ఒకసారి అత‌ను అఖిల్‌ను ఉద్దేశించి అయ్య‌గారే నంబ‌ర్ వ‌న్ అనే కామెంట్ చేయ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆ వీడియో బాగా పాపుల‌ర్ అయి.. నెటిజ‌న్లు అఖిల్‌ను అయ్య‌గారు అన‌డం మొద‌లుపెట్టారు.

కొంద‌రు స‌ర‌దాకు ఈ మాట అంటారు. కొంద‌రు వెటకారాలాడ‌తారు. ఏదైతేనేం అఖిల్ అయ్య‌గారిగానే పాపులర్ అయిపోయాడు. స్వ‌యంగా అఖిల్ ఈ అభిమానిని గుర్తించి క‌ల‌వ‌డంతో అయ్య‌గారు ట్యాగ్ మ‌రింత బ‌ల‌ప‌డిపోయింది. ఐతే మ‌రో అక్కినేని కుటుంబ‌ హీరో సుమంత్ మాత్రం అయ్య‌గారు ట్యాగ్ త‌న‌దంటుండ‌డం విశేషం.

త‌న కొత్త చిత్రం మ‌హేంద్ర‌గిరి వారాహి ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సుమంత్ ఈ కామెంట్ చేశాడు. ఈ వేడుక‌కు అఖిల్ అతిథిగా రాగా.. ఫ్యాన్స్ అయ్య‌గారు అయ్య‌గారు అంటూ అరిచారు. దీనిపై సుమంత్ స్పందిస్తూ.. త‌మ కుటుంబంలో అతి పెద్ద మ‌న‌వ‌డిని తానే అని, అయ్య‌గారు అనే ట్యాగ్ ఇస్తే తన‌కే ఇవ్వాల‌ని, అఖిల్‌కు కాద‌ని చ‌మ‌త్క‌రించాడు. త‌ర్వాత త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ.. చిన్న‌వాడైనా త‌న సినిమాకు స‌పోర్ట్ చేయ‌డానికి అఖిల్ వ‌చ్చాడ‌ని.. లెనిన్ రూపంంలో అత‌డికి పెద్ద హిట్ ప‌డ‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని సుమంత్ తెలిపాడు.

అఖిల్ స‌క్సెస్ అయితే అత్యంత సంతోషించేవాళ్ల‌లో తాను ముందుంటాన‌ని.. ఆ విష‌యం త‌న‌కు కూడా తెలుస‌ని సుమంత్ అన్నాడు. లెనిన్ మూవీని చివ‌రి 40 నిమిషాల్లో త‌న భుజాల మీద అఖిల్ క్యారీ చేసిన విధానం అద్భుత‌మ‌ని.. అక్క‌డ అత‌నెంతో మెచ్యూరిటీ చూపించాడ‌ని.. రెండోసారి ఈ సినిమా చూసిన‌పుడు అత‌డి న‌ట‌న‌లో ప్ర‌త్యేక‌త త‌న‌కు అర్థ‌మైంద‌ని చెప్పాడు సుమంత్. మ‌హేంద్ర‌గిరి వారాహి ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on September 6, 2026 11:39 pm

Share

Recent Posts

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

2 minutes ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

49 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

3 hours ago