Movie News

కొత్త మార్కెట్ తెరిచిన కలీన్ భయ్యా

ఒక వెబ్ సిరీస్ సినిమాగా మారిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుందానే అనుమానం  మిర్జాపూర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు అందరికీ కలిగింది. అందులోనూ మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ ని వెండితెర కోసం మూడు గంటల కంటెంట్ గా మార్చడం పెద్ద ఛాలెంజ్. పైగా కీలక పాత్రలు కొన్ని చనిపోయిన తర్వాత. అయితే టీమ్ దీన్ని సవాల్ గా తీసుకుని అవే క్యారెక్టర్లను తిరిగి బ్రతికించి పూర్తిగా కొత్త కథతో మిర్జాపూర్ ని సిల్వర్ స్క్రీన్ కోసం విజయవంతంగా కన్వర్ట్ చేసింది.

కట్ చేస్తే మిర్జాపూర్ ఊహించని ఓపెనింగ్ దక్కించుకుంది. రెండు రోజులకు సుమారు 70 కోట్లతో బోణీ చేశాక వీకెండ్ మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. నిజానికి మిర్జాపూర్ మూవీకి యునానిమస్ రివ్యూలు రాలేదు. అయితే ఈ సిరీస్ ని విపరీతంగా ప్రేమించిన వాళ్లకు, కలీన్ భయ్యా – మున్నా – గుడ్డు పాత్రలను అభిమానించిన వాళ్ళను సంతృప్తి పరిచేలా ఉండటం వసూళ్లకు కలిసి వస్తోంది. కొత్తగా రవికిషన్ క్యారెక్టర్ జోడించి రెండు వర్గాల మధ్య గ్యాంగ్ స్టర్ డ్రామాగా కొత్త మలుపు తిప్పడం ఆకట్టుకుంది.

కథ పరంగా చూస్తే మరీ ఎగ్జైటింగ్ గా అనిపించదు. మిర్జాపూర్ నేర సామ్రాజ్యాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న కలీన్ భయ్యాని పడగొట్టేందుకు సిఎం తమ్ముడు ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న బబ్బన్ యాదవ్ ని రెచ్చగొడతాడు. ముందు వ్యాపారం పేరుతో స్నేహం మొదలుపెట్టిన బబ్బన్ ఆ తర్వాత కలీన్ గ్యాంగ్ ని తన స్థావరానికి వచ్చేలా చేసి చంపడానికి చూస్తాడు. ఆ తర్వాత జరిగే యుద్ధం, దానికి ముందు వెనుక జరిగిన పరిణామాలు ఈ మిర్జాపూర్ మూవీ.

వెబ్ సిరీస్ లో ఉన్నన్ని ట్విస్టులు, షాకింగ్ థ్రిల్స్ ఈ సినిమాలో అంతగా ఉండవు. నాలుగు పాత్రల మధ్య డ్రామాకు ప్రాధాన్యం ఇవ్వడంతో మలుపులకు ఎక్కువ అవకాశం లేకుండా పోయింది. క్లైమాక్స్ కొంచెం సాగదీసినట్టు అనిపించినా ఓవరాల్ గా నిరాశ పరచకుండా నడిపించడంలో దర్శకులు గుర్మీత్ సింగ్ సక్సెస్ అయ్యారు. అందులోనూ కాంపిటీషన్ వేరే చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం మిర్జాపూర్ కు బాగా కలిసి వస్తోంది. ఆదివారంతో వంద కోట్ల లాంఛనం జరిగిపోతుంది. 

This post was last modified on September 6, 2026 10:20 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

47 minutes ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

2 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

2 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

6 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

7 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

8 hours ago