అప్పుడు నడుము గిల్లే సీన్ వద్దన్న వైష్ణవి

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏ హద్దులైనా చెరిపేయగల నటీమణులు చాలా అరుదుగా కనిపిస్తారు. అందులోనూ తెలుగు సినిమా పరిశ్రమలో లోకల్ అమ్మాయిలు కమర్షియల్ హద్దులు దాటి బోల్డ్ లేదా ఇంటెన్స్ రోల్స్ చేయడం మరింత అరుదు. ఇక కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు చాలా ఆచిచూసి అడుగులేసిన వైష్ణవి.. మెయిన్ లీడ్ రోల్ వచ్చేసరికి మొత్తం లెక్కలన్నీ మార్చేసి టాలీవుడ్ ను షేక్ చేసింది.

ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను దర్శకుడు శివ నిర్వాణ ఎపిక్ ఈవెంట్ లో గుర్తుచేస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘టక్ జగదీష్’ సమయంలో ఆమె ఒక చిన్న పాత్ర చేస్తున్నప్పుడు, సీన్‌లో రౌడీ నడుము పించ్ చేయాలనే బిట్ ఉంటే ‘నేను అన్‌కంఫర్టబుల్ అండీ.. చేయలేను’ అంటూ నిర్మొహమాటంగా రిఫ్యూజ్ చేసిందట. అప్పుడు ఆమెను కేవలం పక్కింటి అమ్మాయి తరహా లిమిటెడ్ ఫ్రేమ్‌లోనే అందరూ చూశారు. కానీ ఆ తర్వాత ‘బేబీ’ రూపంలో ఆమె బాక్సాఫీస్ ముందు పెట్టిన పెర్ఫార్మెన్స్ చూసి శివ నిర్వాణ మైండ్ బ్లాంక్ అయిపోయిందట.

కెరీర్ మొదట్లోనే అలాంటి సంక్లిష్టమైన, గ్రే షేడ్స్ ఉన్న, రొమాంటిక్ బోల్డ్‌నెస్ డిమాండ్ చేసే పాత్రలను అంగీకరించడానికి స్టార్ హీరోయిన్లు కూడా వందసార్లు ఆలోచిస్తారు. ఒక్కసారి ఆడియన్స్ మైండ్‌లో నెగటివ్ ముద్ర పడితే కెరీర్ రిస్క్‌లో పడుతుందనే భయం ఉంటుంది. వైష్ణవి ఆ పాత్రను కేవలం గ్లామర్ కోసమో లేదా వివాదం కోసమో కాకుండా, ఒక పెర్ఫార్మర్‌గా నూటికి నూరు శాతం ఆవాహన చేసుకుని తెరపై నిలబడింది. చిన్న సీన్‌లో నడుము టచ్ చేయడానికి వద్దన్న అమ్మాయేనా ఇది అని డైరెక్టర్లు సైతం నోరెళ్లబెట్టేలా తన నటనతో సమాధానం చెప్పింది.

ఇప్పుడు సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ కోసం ఆమె మళ్లీ సరికొత్త అవతారమెత్తింది. బేబీలో కనిపించిన పెయిన్, డ్రామా పక్కనపెట్టి.. ఒక ఎనర్జిటిక్, మోడ్రన్, ఎక్స్‌ప్రెసివ్ గర్ల్‌గా లీడ్ రోల్ తీసుకుంది. ఇందులో సెకండ్ హాఫ్‌లో వచ్చే 15 నిమిషాల ఎమోషనల్ సీక్వెన్స్‌లో ఆమె చెప్పే డైలాగులు, యాక్టింగ్ సినిమాకే హైలెట్ గా మారబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. వ్యక్తిగత కంఫర్ట్‌కు, కథ డిమాండ్ చేసే పాత్రకు మధ్య తేడాను వైష్ణవి చాలా వేగంగా అర్ధం చేసుకుంది. అనవసరమైన ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లకుండా, కథ డిమాండ్ చేసినప్పుడు ఎంతటి ఛాలెంజింగ్ రోల్ అయినా చేసే గట్స్ ఉన్నాయని ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక నెక్స్ట్ అమ్మడి సెలక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.