Movie News

హడావిడి లేకుండా 100 కోట్లు లాగేసింది

చిన్న మూవీ, అందులోనూ కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. పైగా డివోషనల్ బ్యాక్ గ్రౌండ్. ఎంత దేవుడి సినిమా అయినా జనం ప్రతిదాన్ని ఎగబడి చూసేంత సీన్ లేదిప్పుడు. అలాంటిది ప్యాన్ ఇండియా పోటీలను తట్టుకుని మరీ ఒక చిత్రం వంద కోట్లు సాధించిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. గత నెల విడుదలైన బాలీవుడ్ మూవీ హనుమాన్ అంశ్ దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. నెల తిరక్కుండానే 100 కోట్ల గ్రాస్ క్లబ్బులోకి అడుగు పెట్టడం చరిత్రగా నిలుస్తోంది.

ఆగస్ట్ 7 హనుమాన్ అంశ్ రిలీజైనప్పుడు జనంలో అసలు ఎలాంటి అంచనాలు లేవు. మొదటి రెండు మూడు రోజుల గ్రాస్ దేశవ్యాప్తంగా కేవలం లక్షల్లో ఉంది. అధిక శాతం సెంటర్లలో అసలు విడుదలే కాలేదు. వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియనంత వీక్ గా ప్రమోషన్లు జరిగాయి. తర్వాత అద్భుతం జరిగిపోయింది. పబ్లిక్ టాక్, రివ్యూలు, సోషల్ మీడియా సపోర్ట్ అన్నీ అనుకూలంగా మారిపోవడంతో హనుమాన్ అంశ్ కు థియేటర్లు పెరిగి కలెక్షన్ ప్రవాహం మొదలైపోయింది.

ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. టాక్సిక్ వచ్చినా మీర్జాపూర్ వచ్చినా వాటిని హనుమాన్ అంశ్ లెక్క చేయడం లేదు. నిత్యం బుక్ మై షో ట్రెండింగ్ లో ఉంటోంది. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు లక్ష్మణ్ దాస్ / నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. తక్కువ తారాగణంతో పేరున్న నటీనటులు లేకుండా పరిమిత బడ్జెట్ తో తీసిన హనుమాన్ అంశ్ ఇప్పుడు కనకవర్షం కురిపిస్తోంది.

అచ్చం మన ఇరుముడి లాగా ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఫైనల్ కలెక్షన్లు ఎక్కడ ఆగుతాయో ట్రేడ్ వర్గాలతో సహా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వందల కోట్లు పెట్టి రెండు భాషల్లో సమాంతరంగా తీసినంత మాత్రం పబ్లిక్ గుడ్డిగా చూస్తారనే గ్యారెంటీ లేదని టాక్సిక్ నిరూపించింది. సరైన కథా కథనాలతో కనెక్ట్ అయితే బడ్జెట్ తో సంబంధం లేకుండా జనం బ్రహ్మరథం పడతారని ఇరుముడి, హనుమాన్ అంశ్ బాక్సాఫీస్ సాక్షిగా నిరూపిస్తున్నాయి. 

This post was last modified on September 5, 2026 8:00 am

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

10 minutes ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

33 minutes ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

3 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

3 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

5 hours ago