ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఆయనకు భారీ అభిమాన గణం ఉంది. రోజాతో మొదలుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఐతే ఎంత గొప్ప దర్శకుడైనా.. ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోతాడనడానికి మణిరత్నం కూడా మినహాయింపు కాలేకపోయారు.
ఇక గత ఏడాది వచ్చిన థగ్ లైఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకుంటే అంత మంచిది. ఈ సినిమా చూశాక మణిరత్నం అభిమానులు కూడా ఆయన పనైపోయిందనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ దెబ్బ నుంచి ఆయన కోలుకోగలరా అని సందేహించారు. కానీ కొంచెం గ్యాప్ తర్వాత ఈ లెజెండరీ డైరెక్టర్ సినిమాను లైన్లో పెట్టాడు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి లాంటి గ్రేట్ పెర్ఫామర్లతో మణిరత్నం ప్రేమకథ తీస్తున్నాడు అనగానే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది.
సైలెంటుగా షూట్ మొదలుపెట్టి.. చకచకా చిత్రీకరణ పూర్తి చేస్తున్న మణిరత్నం.. ఈ సినిమా గురించి ఫస్ట్ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ నెల 7న ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు. మనిషి జీవితంలో బ్లాక్ అండ్ వైట్ తక్కువ.. మిలియన్ల కొద్దీ రంగులుంటాయి అంటూ తన మార్కు విజువల్స్‌తో చిన్న గ్లింప్స్ ద్వారా ఈ అప్‌డేట్ ఇచ్చాడు మణిరత్నం. ఏఆర్ రెహమాన్ సూతింగ్ బీజీఎంతో ఈ వీడియోకు ఆకర్షణ తీసుకొచ్చాడు. ఈ గ్లింప్స్ చూస్తే మళ్లీ వెండితెరపై మణిరత్నం మ్యాజిక్ చూడబోతున్నామనే ఆశలు కలుగుతున్నాయి.
ఎక్కువగా సౌత్ ఇండియాకు చెందిన రవివర్మ, రవి.కె.చంద్రన్, సంతోష్ శివన్ లాంటి సినిమాటోగ్రాఫర్లతో పని చేసే మణిరత్నం.. ఈ సినిమాకు బాలీవుడ్ మూవీ గులాబో సితాబోతో మంచి గుర్తింపు సంపాదించిన బెంగాలీ ఛాయాగ్రాహకుడు అన్విక్ ముఖోపాద్యాయ్‌ను ఎంచుకోవడం విశేషం. ఎప్పట్లాగే లెజెండరీ తెలుగు ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు మణిరత్నం. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం సంస్థ మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.
This post was last modified on September 4, 2026 10:40 pm
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…
ప్రీమియర్ షో పూర్తయినప్పటి నుంచి ది ప్యారడైజ్ మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ అందరూ చూస్తున్నదే. పాజిటివ్…
ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాక్రోచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే.. అందులో ‘దృశ్యం’ ముందు వరుసలో నిలుస్తుంది. మలయాళంలో సెన్సేషనల్…
మన దగ్గర తెరమీద కనిపించడం మానేసింది కానీ బాలీవుడ్ ఆఫర్లతో మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ దివ్యంగానే ఉంది. సినిమాలు,…