పరుగులు పెడుతున్న ప్యారడైజ్ బృందం

ప్యాన్ ఇండియా సినిమాలకు వచ్చే అతి పెద్ద చిక్కు రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఒత్తిడి ఎక్కువైపోవడం. ఆ మధ్య నాగార్జున అన్నట్టు ఫస్ట్ కాపీని మనం కనీసం రెండు వారాల ముందే సిద్ధం చేసుకోలేని పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నాం. దానికి కారణాలు ఏమైనా ముందస్తు ప్లానింగ్ సరిగ్గా ఉండటం లేదన్నది ఆయన వెర్షన్. అందులో నిజం లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి వందల కోట్ల మూవీ నుంచి లెనిన్ లాంటి మీడియం బడ్జెట్ చిత్రాలకు సైతం ఈ ప్రెజర్లు వస్తూనే  ఉన్నాయి.

ఇప్పుడు ప్యారడైజ్ వంతు వచ్చింది. సెప్టెంబర్ 24 ముంచుకు వస్తోంది. ఎక్కువ టైం లేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ తొమ్మిదో తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతామని ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో డెడ్ లైన్ మీట్ అయ్యేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బృందం కిందా మీద పడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా కొందరు కీలక ఆర్టిస్టుల డబ్బింగు పెండింగ్ ఉందట. వచ్చే వారంలోగా ఆ లాంఛనం అయిపోతే ఒక టెన్షన్ తీరిపోతుంది.

ముందు ట్రైలర్ సిద్ధం చేయాలి. బ్యాలన్స్ ఉన్న లిరికల్ సాంగ్స్ ఎప్పుడు వదలాలనేది నిర్ణయించుకోవాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ చేయాలనే దాని మీద ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. ముంబై చెన్నై బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో మీట్ ది ప్రెస్ నిర్వహించాలి. వీటికి తోడు ఇంటర్వ్యూలు ఉండనే ఉంటాయి. చేతిలో ఉన్నది కేవలం 19 రోజులు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే హిట్ 3 థర్డ్ కేసుకి నాని నెల రోజులు నాన్ స్టాప్ పబ్లిసిటీ చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇదంతా ఎలా ఉన్నా సెప్టెంబర్ 23 రాత్రి ప్రీమియర్లు ప్రపంచవ్యాప్తంగా పడాలంటే పరుగులు పెడితే సరిపోదు. ఉరుకులు పరుగులు మీద అందరినీ రన్ రాజా రన్ అనాలి. యుఎస్ నుంచి నాని రాగానే తనదైన శైలిలో ప్రమోషనల్ ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాడట. దాన్ని వెంటనే అమలు చేయాలి. మోహన్ బాబు, కయదు లోహర్, సంపూర్ణేష్, రాఘవ్ జుయెల్ మొదలైన వాళ్ళు ప్రచారంలోకి దిగాలి. అనిరుధ్ రవిచందర్ రీ రికార్డింగ్ చాలా కీలకం కానుంది. చెన్నై స్టూడియోలో ఆ పనులు జరుగుతున్నట్టు టాక్.