ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకా’ను అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోట్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. ఈ సినిమా మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా జస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ అనౌన్స్ అయ్యాక బన్నీ రెండు పుట్టిన రోజులు జరుపుకోగా.. ఇంతకుమించి అప్‌డేట్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు.. టీజర్ ఎప్పుడొస్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
బన్నీ ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు కానీ.. ‘రాకా’ మాత్రం పెద్దగా చర్చల్లో ఉండట్లేదు. బన్నీ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఈ సినిమా గురించి చర్చించుకోని టైంలో.. సడెన్‌గా ‘రాకా’ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. రాాకా రిలీజ్ డేట్ గురించే కాక ఈ సినిమాలో విశేషాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
‘రాకా’ వచ్చే ఏడాది మధ్యలో రిలీజవుతుందనే అంచనాతో ప్రేక్షకులు ఉండగా.. 2027 డిసెంబరులోనే విడుదల అని ఒక ప్రచారం నడుస్తోంది. కానీ అదెంత వరకు నిజం అన్న దానిపై క్లారిటీ లేదు. మరీ అంత లేట్ అయితే బన్నీ ఫ్యాన్స్ గగ్గోలు పెడతారనడంలో సందేహం లేదు. మరోవైపు ‘రాకా’లో దీపికా పదుకొనే కథ ప్రకారమే ప్రెగ్నెంట్‌గా కనిపించనుందని.. ఆమె నిజంగానే కొన్ని నెలల ముందు గర్భం దాల్చడంతో దర్శకుడు అట్లీ సందర్భోచితంగా ఆమె మీద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు.
ఇక ఇందులో మరో కథానాయిక అయిన రష్మిక మందన్నా పాత్ర సినిమా మధ్యలో ఎంట్రీ ఇస్తుందని.. చివరికి ఆమె పాత్ర బాగా హైలైట్ అవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా ఒక రూమర్ వినిపిస్తోంది. ఇలా ‘రాకా’ గురించి సడెన్‌గా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఐతే ఇవన్నీ బయటి వాళ్లు లీక్ చేసిన విషయాలా.. లేక సినిమాను వార్తల్లో నిలబెట్టడానికి టీమే లీక్స్ ఇచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూ.800 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తుండడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates