బాలీవుడ్ తారలతో ‘డ్రాగన్’ జోడింపులు

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి విదితమే. తారక్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత నాలుగైదు వారాలు విశ్రాంతి రికమండ్ చేయడంతో ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇందులో క్యాస్టింగ్ కు సంబంధించి బాలీవుడ్ అట్రాక్షన్లు పెరుగుతున్నాయి. తాజాగా షాహిద్ కపూర్, అలియా భట్ ఇందులో భాగం కాబోతున్నారనే వార్త అభిమానులకు ఊహించనంత హాట్ న్యూస్ కానుంది.

ఎందుకంటే షాహిద్ కపూర్ ఇప్పటిదాకా టాలీవుడ్ లో నటించలేదు. అలియా భట్ ఆర్ఆర్ఆర్ తో ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ ఇటువైపు రాలేదు. ఈ వార్త కొన్ని వారాల క్రితమే లీకైనప్పటికీ తాజాగా వాళ్ళ డేట్స్ దొరకడంతో కన్ఫర్మ్ అయ్యిందని అంతర్గత వర్గాల సమాచారం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ లాంటివి ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు. అనిల్ కపూర్ లాంటి సీనియర్లు ఆల్రెడీ భాగమైన ఈ ప్యాన్ ఇండియా మూవీలో షాహిద్, అలియా రావడం ఖచ్చితంగా ప్రయోజనం కలిగించేదే.

2027 జూన్ విడుదలకు రెడీ అవుతున్న డ్రాగన్ డేట్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోలేని ఎపిసోడ్స్ ని చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు. జూనియర్ తిరిగి వచ్చాక నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ నుంచి రీ స్టార్ట్ చేసినా అక్కడి నుంచి ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు. బాహుబలి, పుష్ప లాగా కాకుండా రెండు భాగాలు ఒకేసారి షూట్ చేసుకోవడం డ్రాగన్ కు ప్లస్ అవుతోంది.

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 నిరాశ పరచడంతో యంగ్ టైగర్ అభిమానుల ఆశలన్నీ డ్రాగన్ మీదే ఉన్నాయి. టీజర్ కూడా బాగానే రీచ్ అయ్యింది. డిఫరెంట్ షేడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలు షాక్ ఇస్తాయని లీకైన సోర్స్ నుంచి తెలుస్తున్న ఇన్ఫో. బాగా ఆలస్యం అవుతున్నప్పటికీ బెస్ట్ కోసం ఇద్దరూ కష్టపడుతున్న తీరు తెరమీద గొప్పగా పండుతుందని అంటున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బడ్జెట్ మూడు వందల కోట్ల దాకా ఉంటుందని ఒక టాక్.