Movie News

200 కోట్ల పల్లకి — ఇరుముడి పరుగు ఎక్కడికి

టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంచనాలకు అతీతంగా, లెక్కలకు అందకుండా అవి చేసే అద్భుతాల గురించి ఎప్పుడు విన్నా అబ్బురంగా ఉంటుంది. పాతిక సంవత్సరాల క్రితం నువ్వే కావాలి వచ్చినప్పుడు అది రెండు వందల రోజులు ఆడుతుందని, స్టార్ హీరోల వల్ల మాత్రమే సాధ్యమయ్యే రికార్డులు బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అయినా చరిత్ర సృష్టించింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ లో ఇలాంటివి మనకు చాలా అరుదైపోయాయి.

గత నెల విడుదలైన ఇరుముడి మరోసారి గతాన్ని గుర్తు చేస్తోంది. ఇరవై రోజులు కాకుండానే సగర్వంగా రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి విజయ కేతనం ఎగరేసింది. చాలా చోట్ల చిన్న సెంటర్లలో ఒక సినిమా వారం ఆడితే గొప్పనుకునే టైంలో, పదమూడు రోజులకు కూడా ఇంకా మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేయడం చూసి బయ్యర్లకు నోట మాట రావడం లేదు. రూపాయికి అయిదు రూపాయల లాభం గురించి వినడమే కానీ ఈ మధ్య కాలంలో అది చేసి చూపించింది ఇరుముడినే.

ఇప్పటికీ పలు చోట్ల జనం తండోప తండాలుగా వస్తున్నారు. కొన్ని థియేటర్లలో షోలు లేవంటే గొడవలు జరిగాయి. మక్తల్ లో ఏకంగా ఆడియన్స్ ధర్నా చేసే దాకా వెళ్ళింది. టాక్సిక్ సైతం దీని తాకిడి తట్టుకోలేక తన సింగల్ స్క్రీన్లను వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. పిల్లా పీచు చిన్నా పెద్దా అందరూ బండ్లు కట్టుకుని, వాహనాలు వేసుకుని మరీ ఇరుముడికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరలయ్యాయి. ఇవన్నీ ఫ్యూచర్ లో కథలుగా చెప్పుకునే జ్ఞాపకాలే.

ఇక్కడితో ఇరుముడి పరుగు అయిపోలేదు. ఇంకో వీకెండ్ రవితేజకు స్వాగతం చెబుతోంది. కొత్త రిలీజులు బోలెడు ఉన్నా సరే సెలవు వస్తే చాలు ఫ్యామిలీలు ఇరుముడికి వెళ్లిపోతున్నాయి. చూడని వాళ్ళు ఓటిటి వరకు ఆగడం లేదు. ఒకసారి థియేటర్ ఎక్స్ పీరియన్స్ కావాలని గంపగుత్తగా టికెట్లు కొనేసుకుంటున్నారు. చూస్తుంటే 250 కోట్ల వరకు ఇరుముడి అలిసిపోయేలా లేదు. రవితేజ, శివ నిర్వాణ, మైత్రి నిర్మాతలు, జివి ప్రకాష్ కుమార్ మొదలైనవాళ్ళకు ఈ సక్సెస్ ఇచ్చిన కిక్కు వెయ్యి ఏనుగుల బలంతో సమానం. 

This post was last modified on September 2, 2026 10:47 pm

Share

Recent Posts

ఆ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

3 hours ago

స్టార్ సినిమా శ్రీలీలకే దక్కింది

తెలుగు సినిమాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చిన హీరోయిన్ శ్రీలీల. ఆమె తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరగడం వల్ల అక్కడే…

6 hours ago

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

7 hours ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

7 hours ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

8 hours ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

8 hours ago