సూపర్‍స్టార్‍కి లొంగిపోయిన లోకేష్‍

‘ఖైదీ’ సినిమాలో హీరోయినే లేకుండా, హీరో నేపథ్యం ఏమిటనేది చెప్పకుండా కేవలం తన డైరెక్షన్‍ స్కిల్స్తో ప్రేక్షకులను కట్టి పడేసి కమర్షియల్‍ హిట్‍ కొట్టిన దర్శకుడు లోకేష్‍ కనగరాజ్‍ సూపర్‍స్టార్‍ విజయ్‍ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడంటే కచ్చితంగా చాలా కొత్త రకం సినిమా ఇస్తాడని భావించారు. తన మార్కు తెలిసేలా నేపథ్యమయితే ఎంచుకున్నాడు కానీ విజయ్‍ ఇమేజ్‍ను దాటి ప్రయోగం చేయడానికి లోకేష్‍ సాహసించలేకపోయాడు.

విజయ్‍ను ఫాన్స్ ని మెప్పించే విధంగా చూపించడం కోసమని అతను కాంప్రమైజ్‍ అయిపోవడంతో ‘మాస్టర్‍’ మూస సినిమాగా మిగిలిపోయింది. లోకేష్‍ లాంటి క్రియేటివ్‍ దర్శకులు కూడా సూపర్‍స్టార్ల ఇమేజ్‍కి దాసోహమని లొంగిపోతే ఇక పెద్ద స్టార్లతో కొత్త సినిమాలెలా వస్తాయి. అలాగే పెద్ద హీరోలను ప్రేక్షకులు చూసే దృష్టి ఎలా మారుతుంది. ప్రయోగాత్మక కథలన్నీ చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుంది. తదుపరి చిత్రాన్ని కమల్‍హాసన్‍తో తీయాలని లోకేష్‍ ముందే ఫిక్స్ అయిపోయాడు.

విజయ్‍ తర్వాత మరో పెద్ద స్టార్‍ కావాలంటూ కూర్చోకుండా ‘విక్రమ్‍’ అంటూ అరవై ఆరేళ్ల కమల్‍తో సినిమా చేయడంతోనే తాను స్టీరియోటైప్‍ కాదని, తనకు డిమాండ్‍లో వున్న టాప్‍ హీరోల సినిమాలు మాత్రమే చేయాలనే యోచన లేదని తేల్చేసాడు. విక్రమ్‍తో అయినా ఖైదీ లోకేష్‍ తిరిగి తెరపై కనిపిస్తాడని సినీ ప్రియులు ఆశ పడుతున్నారు.