టాక్సిక్ విడుదలైన తర్వాత నెగటివ్ గా అనిపించిన అంశాల్లో అధిక శాతం ప్రేక్షకులు వేలెత్తి చూపించిన వాటిలో రవి బస్రూర్ సంగీతం ఉంది. ఇటు పాటలు, అటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఒక ప్యాన్ ఇండియా మూవీ స్థాయిలో లేవని చాలామంది ఫీలయ్యారు. కెజిఎఫ్ వచ్చిన టైంలో మరో మ్యూజిక్ సెన్సేషన్ వచ్చాడని, బిజిఎంలో తనను కొట్టేవాళ్ళు ఉండరని జనాలు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. సలార్ లో కొంత ఇంపాక్ట్ తగ్గినా నిరాశపరచకుండా గెలిచారు.
కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. కెజిఎఫ్ తర్వాత రవి బస్రూర్ చాలా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. వాటి పేర్లు ఠక్కున చెప్పమంటే మ్యూజిక్ లవర్స్ సైతం కొంచెం ఆలోచించే టైం తీసుకుంటారు. ఎందుకంటే చార్ట్ బస్టర్స్ అనిపించున్నవి వాటిలో తక్కువ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఇతని చేతిలో డ్రాగన్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ మీద ఏ రేంజ్ లో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు తారక్ అభిమానులు అనిరుధ్ రవిచందర్ కావాలని డిమాండ్ చేశారు. కానీ నీల్ వర్కింగ్ స్టయిల్ కి అతను సూట్ కాడు. అందుకే రవికే ఓటు వేశారు. ఆ మధ్య వచ్చిన టీజర్ లో ఈయన పనితనం పర్వాలేదనిపించింది కానీ వైరల్ అయ్యే రేంజ్ లో, పదే పదే యూత్ తమ వీడియోలకు వాడుకునే స్థాయిలో అయితే లేదు. అది ఫైనల్ అవుట్ ఫుట్ కాదు కాబట్టి ఏదో అనుకోవచ్చు కానీ ఇకపై రవి డ్రాగన్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.
తమన్, అనిరుధ్, దేవి స్థాయిలో పేరు తెచ్చుకోవాలంటే కేవలం రెండు మూడు సినిమాల బీజీఎమ్స్ తో పని జరగదు. అదిరిపోయే పాటలు ఇవ్వాలి. ఆల్బమ్స్ పదే పదే వినాలనిపించేలా ఉండాలి. రవి బస్రూర్ స్వీయ దర్శకత్వం వహించి తీసిన వీర చంద్రహాస కూడా ఏమంత గొప్ప పేరు తెచ్చుకోలేకపోయింది. గత కొన్నేళ్లలో మార్కో, బ్లాస్ట్ జోన్ ఒకటే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. సో డ్రాగన్ కైతే బెస్ట్ ఇవ్వాల్సిందే. జూనియర్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొంత టెన్షన్ పడటం న్యాయమే.
This post was last modified on August 31, 2026 12:22 pm
స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…
పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…
ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…
‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…