Movie News

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ హీరో యష్ అక్కయ్య పాత్ర పోషించారు. దాంతో పాటు ఆమెకు ప్రియుడిని పెట్టడం, లవ్ ట్రాక్ నడిపించడం లాంటివేవీ జొప్పించలేదు. ఏదైనా ఎమోషన్ పండిందంటే అంతో ఇంతో అది ఒక్క నయన్ మీదేనని ఒప్పుకోక తప్పదు. ఇంకా బలమైన భావోద్వేగాలు ఉండాల్సింది కానీ ఇతరత్రా విషయాల మీద కథనం డైవర్ట్ కావడంతో అంతగా పండలేదు.

గ్రోన్ అప్స్ కోసం మాత్రమే తీసిన సినిమాలో నటించడానికి నయన్ ఒప్పుకున్న కారణం ఏంటో అర్థమయ్యిందిగా. మిగిలిన వాళ్ళలో కియారా అద్వానీ, తారా సుతారియాతో యష్ బోల్డ్ సీన్స్ ఉన్నాయి. రుక్మిణి వసంత్ తో కూడా ఘాటైన లవ్ ట్రాక్ నడిపించారు. హ్యూమా ఖురేషి గ్లామర్ తరహా కాదు కాబట్టి ఆవిడని శత్రువుల గ్యాంగ్ లో పెట్టి మమ అనిపించారు. పై ముగ్గురు మీద కామెంట్స్, ట్రోలింగ్ కనిపిస్తోంది కానీ నెటిజెన్లు నయనతారని పూర్తిగా మినహాయించిన మాట వాస్తవం.

ఇంకో ప్లస్ పాయింట్ తన పాత్రను కేవలం ఫస్ట్ హాఫ్ కే పరిమితం చేయడం. దీని వల్ల కూడా నెగటివిటీ తగ్గిపోయింది. అయినా నయన్ ఈ మధ్య కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మన శంకరవరప్రసాద్ గారులో స్కోప్ ఎక్కువగా ఉండబట్టే ఓకే చెప్పింది. బాలయ్య 111 హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ లో చెప్పినప్పుడు ఎస్ చెప్పి తర్వాత స్టోరీ మారిపోయాక తప్పుకుంది. అంటే రెగ్యులర్ కమర్షియల్ ప్యాట్రన్స్ లో తనకు నటించడం ఇష్టం లేదని చెప్పీ చెప్పనట్టే.

తాజాగా హాయ్ లో కనిపించింది. కెవిన్ హీరోగా వచ్చిన ఈ డబ్బింగ్ మూవీమీద రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. ఒక వర్గం మూవీ లవర్స్ కి పర్వాలేదనిపించినా రెగ్యులర్ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది చేయడానికి కారణం కూడా రొటీన్ ఫార్ములాలో లేకపోవడమే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సరసస నటిస్తున్న నయనతార అందులో కూడా ఎలాంటి గ్లామర్ షో చేయడం లేదని ముంబై టాక్. పాటలు ఉంటాయి కానీ డీసెంట్ గానే డిజైన్ చేశారట. 

This post was last modified on August 29, 2026 11:40 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

23 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

53 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago