Movie News

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్ 100 టైటిల్ లాక్ చేశారు. ఇవాళ నాగ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ తో పాటు పేరు ప్రకటించే లాంఛనం అయిపోయింది. కోలీవుడ్ ఫేమ్ రా కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నాగ్ కు బాగా కలిసి వచ్చిన డిసెంబర్ చివరి వారం 24న విడుదల కానుంది. ఫ్యాన్స్ ఊహించినట్టు సంక్రాంతికి కాకుండా ముందుగానే రావడం విశేషం.

ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్తగా కట్ చేశారు. డబ్బు లేనప్పుడు తనను సమాజం ఎంత చులకనగా చూసిందో భరించలేకపోయిన ఒక వ్యక్తి (నాగార్జున) రకరకాల మార్గాల్లో వందల కోట్లు సంపాదిస్తాడు. సొమ్ముల కన్నా ఎక్కువగా జనంలో వచ్చే గుర్తింపు ఎంత గొప్పదో తెలుసుకుంటాడు. అయితే దీని వెనుక నేరాలు, మోసాలు, అన్యాయాలు, హత్యలు జరుగుతాయి. అసలు అతని లక్ష్యం ఏమిటి, కింగ్ 100 వెనుక పరమార్థం ఏమిటనేది తెరమీద చూడాలి.

ఇంత వయసు వచ్చినా స్టయిలిష్ గా కుర్ర హీరోలతో పోటీ పడేలా కనిపించడం నాగార్జునకు మాత్రమే సొంతమైన విద్య. కూలి, కుబేరలో సపోర్టింగ్ రోల్స్ చేయడం వల్ల ఫ్యాన్స్ అసంతృప్తికి గురైన విషయాన్ని గుర్తించి ఈసారి మాస్ రూటు పట్టారు. స్వాగ్, డ్రెస్సింగ్ అంతా వింటేజ్ తరహాలో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతం ఎక్కువ సౌండ్ లేకుండా స్మూత్ గా సాగడం ఆకట్టుకుంటుంది. మొత్తం వీడియోలో నాగార్జునని తప్ప ఇతర ఆర్టిస్టులను రివీల్ చేయలేదు.

క్రిస్మస్ టార్గెట్ చేసుకోవడం బాగానే ఉంది కానీ అదే రోజు బాలయ్య 111 విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్త వచ్చిన టైంలో ఇలా కింగ్ 100 ఆ డేట్ మీద కర్చీఫ్ వేసేసుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామిరంగా తర్వాత మళ్ళీ మాస్ జనాన్ని మెప్పించే  కంటెంట్ ఇవ్వలేదనే లోటులో ఉన్న ఫ్యాన్స్ కి కింగ్ 100 ఫుల్ మీల్స్ అయ్యేలా ఉంది. పాయింట్ ఎలాంటిది అయినా ట్రీట్ మెంట్ మటుకు గతంలో చూడనంత చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.

This post was last modified on August 29, 2026 11:49 am

Share

Recent Posts

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

1 hour ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

2 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

3 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

4 hours ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

4 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

6 hours ago