ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే భారీ వసూళ్లు దక్కడం గతంలో చూశాం. రిలీజ్ ముందు వరకు అనుమానాలు రేపిన మన శంకరవరప్రసాద్ గారు మీద బజ్ హుక్కు స్టెప్పు పాటతో ఎక్కడికో వెళ్లిపోవడం ప్రత్యక్షంగా చూశాం. ఓవర్సీస్ బుకింగ్ అమాంతం పైకి లేవడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. ఇరుముడి ఒక క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ ముత్యాల పల్లకి కోసం మళ్ళీ మళ్ళీ వస్తున్న ఆడియన్స్ లక్షల్లో ఉంటారనేది వాస్తవం.
గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే, పెద్దిలో చికిరి చికిరి ఇలా జనంలో హైప్ తీసుకురావడానికి దోహదం చేసినవే. తాజాగా ప్యారడైజ్ లో ‘ఏష నాగుల కట్ట పాట’ని అనిరుధ్ రవిచందర్ రీమిక్స్ చేశారు. ఈ విషయం కొద్ది రోజుల క్రితమే లీకయ్యింది. ఏళ్ళ తరబడి తెలంగాణ జనాన్ని ఊపేస్తున్న ఈ ఫోక్ సాంగ్ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సందర్భానుసారం వాడుకుంటున్నారు. ఇందులోనే నాని, కీర్తి సురేష్ వేసిన స్టెప్పులు థియేటర్లను ఊపేయడం ఖాయమని యూనిట్ టాక్.
తాజాగా యుఎస్ లో జరిగిన లైవ్ కన్సర్ట్ లో అనిరుద్ దీన్ని పాడుతున్నప్పుడు స్టేడియం హోరెత్తిపోయింది. దాని తాలూకు వీడియో క్లిప్పులు ఎక్స్, ఇన్స్ టాని ఊపేస్తున్నాయి. అఫీషియల్ సాంగ్ రావడానికి ముందే ఇది ఇంత రీచ్ అయ్యిందంటే రేపు సినిమాలో చూశాక అభిమానులు ఇంకే స్థాయిలో ఊగిపోతారో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ సాంగ్ లాంచ్ కోసమే నాని ప్రత్యేకంగా యుఎస్ వెళ్లడం చూస్తుంటే ఎలాంటి అవుట్ ఫుట్ వచ్చిందో ఊహించుకోవచ్చు.
సెప్టెంబర్ 24 విడుదల కాబోయే ప్యారడైజ్ కు ఆయా షేర్ మొదటి పునాది బలంగా వేయగా ఇప్పుడీ ఏష నాగుల కట్ట దాన్ని పటిష్ట పరచనుంది. కాసర్ల శ్యాం అందించిన సాహిత్యం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. విడుదల తేదీ ఇంకో ఇరవై ఏడు రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ పరుగులు పెడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ మీద ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ప్రసక్తే లేకుండా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు కన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ట్రైలర్ రెండో వారంలో లాంచ్ చేయబోతున్నారు.
This post was last modified on August 29, 2026 11:02 am
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…