Movie News

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్ ఏర్పాట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముందీ పాత్ర కోసం సాయిపల్లవిని అనుకున్నారు. దాదాపుగా ఓకే అయినంత దూరం వెళ్ళింది. కానీ క్రమంగా ఈ ప్రాజెక్టుకి ఎక్కువ డేట్స్ అవసరం కావడంతో వాటిని అడ్జస్ట్ చేసే పరిస్థితిలో ఆమె లేకపోవడంతో ఇప్పుడా అవకాశం రష్మిక మందన్నని వరించినట్టు తెలిసింది. ఇది అద్భుతమైన అవకాశం.

ఇప్పటి తరానికి సుబ్బులక్ష్మిగారి గురించి తక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి ఇలాంటి కథలను స్క్రీన్ ద్వారా చెప్పే అవసరం ఎంతైనా ఉంది. రష్మిక మందన్నకు ఈ ఛాన్స్ రావడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే కీర్తి సురేష్ ఎన్ని సినిమాలు చేసినా, ఎందరు స్టార్ హీరోలతో నటించినా మహానటి తెచ్చిన ఫేమ్ ముందు అవన్నీ తక్కువే. తనకే కాదు వేరే ఏ ఇతర హీరోయిన్ కి మహానటిని మించే పెర్ఫార్మన్స్ సినిమా దొరకలేదు. సుబ్బులక్ష్మి ఆత్మకథలో ఆ ఛాన్స్ ఉంది.

అయితే సావిత్రి గారి జీవితం లాగా సుబ్బులక్ష్మి గారి లైఫ్ లో ఎక్కువ డ్రామా, విషాదం ఉండవు. కానీ ఆసక్తికరమైన సంఘటనలు బోలెడు. చిన్న వయసులోనే గాయని కావడం దగ్గరి నుంచి అంతర్జాతీయ పురస్కారాలు అందుకునే స్టేజి వరకు వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవమానాలు చవి చూశారు. అవన్నీ సినిమాలో వస్తాయి. రష్మిక మందన్నకు నటన పరంగా ఇదో ఛాలెంజ్ అవుతుంది. అంచనాలు నిలబెట్టుకుంటే ఎప్పటికీ చెప్పుకునే సినిమా అవుతుంది.

సెప్టెంబర్ 16 సుబ్బులక్ష్మి గారి జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. కమర్షియల్ ప్యాన్ ఇండియా సినిమాల మధ్య నలిగిపోతున్న జనాలకు ఇలాంటి మూవీస్ రిలీఫ్ తో పాటు స్ఫూర్తిని, జ్ఞానాన్ని ఇస్తాయి. సంగీత దర్శకుడు, ఇతర క్యాస్టింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి. హీరో ఎవరైనా కథ మొత్తం రష్మిక మందన్న చుట్టే ఉంటుంది కాబట్టి ఆ విషయంలో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిని తీసుకోకపోవచ్చు. చూద్దాం.    

This post was last modified on August 28, 2026 11:37 am

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

1 hour ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

3 hours ago