నిన్న విడుదలైన టాక్సిక్ మొదటి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్షేత్ర స్థాయి నెంబర్లు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ భారీ ఓపెనింగ్ దక్కిన మాట వాస్తవం. నిన్న దాదాపు అడ్వాన్స్ బుకింగ్ మీద అత్యధిక శాతం షోలు ఆక్యుపెన్సీ తెచ్చుకున్నాయి. అంటే షో సమయానికి టికెట్లు దొరుకుతాయో లేదోనని మొదటిరోజే చూడాలన్న సంకల్పంతో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు భారీగా కొనేశారు. నార్త్ లో రెస్పాన్స్ ఎక్కువగా ఉంది.
టాక్ ఎలా ఉందనేది పక్కనపెడితే ఫైనల్ గా ఎక్కడికి వెళ్తుందనేది ఆదివారానికి క్లారిటీ రావొచ్చు. సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టాక్సిక్ బృందం మాత్రం తమది స్లో పాయిజన్ తరహాలో ఎక్కేస్తుందని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కెజిఎఫ్ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని మరీ టాక్సిక్ కోసం కష్టపడిన యష్ కు దానికి తగ్గ ఫలితం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గ్రోన్ ఆప్స్ స్టోరీ పేరుతో ఫ్యామిలీస్ కి దూరం కావడం కొంత ప్రభావం చూపించింది.
ఒక్కటి మాత్రం నిజం. యష్ కి గ్రౌండ్ లెవెల్ లో అభిమాన గణం చాలా బలంగా ఉంది. కర్ణాటకలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏపీ తెలంగాణలో సైతం ఉదయం ఆరు గంటల షోలు హౌస్ ఫుల్ కావడం తేలిగ్గా చూసే విషయం కాదు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి జనాల్లో ఎలాంటి బ్రాండ్ లేకపోయినా కెవిఎన్ సంస్థ భారీ నిర్మాణం, కెజిఎఫ్ రూపంలో యష్ సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ అండగా నిలబడి ఇంత పెద్ద నెంబర్లు వచ్చేలా చేశాయి. ఇది నిలబడటం కీలకం.
పెద్ద స్థాయికి వెళ్లిన యష్ లాంటి హీరోలు ఇకపై అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకోవడం అవసరం అనిపిస్తోంది. యాక్షన్ వయొలెన్స్ ఒకటే ఆడియన్స్ వీళ్ళ నుంచి కోరడం లేదు. రామ్ చరణ్ పెద్ది చేసింది అందుకే. దేవరలో ఉన్న సముద్ర నేపధ్యమే జూనియర్ ఎన్టీఆర్ ని కొరటాలకు ఓకే చెప్పేలా చేసింది. ప్రభాస్ సైతం ఒకదానితో మరొకటి సంబంధం లేని కథలను ఎంచుకున్నాడు. యష్ కూడా ఇలాంటి ప్లానింగ్ చేసుకుంటే కెరీర్ లో అద్భుతాలు చూడొచ్చు.
This post was last modified on August 27, 2026 7:13 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…