గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఊహించని ఒక సంచలనం ఇరుముడి రేపుతోంది. ప్యాన్ ఇండియా బడ్జెట్ లేకుండా, బాలీవుడ్ నుంచి కోట్లు కుమ్మరించి హీరోయిన్ ని తీసుకురాకుండా, పక్కా తెలుగు నేటివిటీలో అది కూడా ఒక చిన్న ఊరిలో నడిపించిన కథకు ఆడియన్స్ ఈ స్థాయిలో బ్రహ్మరథం పడతారని నిర్మాతలు కూడా అనుకుని ఉండరేమో. అంచనాలకు మించి అద్భుతం చేస్తున్న ఇరుముడి గురించి చెప్పుకోవాల్సిన విశేషం, వీక్ డేస్ లోనూ ఏ మాత్రం తగ్గని ఆక్యుపెన్సీలతో దూసుకుపోవడం.
ప్రస్తుతం నూటా ఇరవై కోట్లు దాటేసిన ఇరుముడి ఫైనల్ థియేటర్ రన్ అయ్యేలోపు రెండు వందల కోట్లను అందుకోవాలనేది సగటు మూవీ లవర్స్ కోరిక. చూస్తుంటే అదేమీ అసాధ్యం అనిపించడం లేదు. ఎందుకంటే టాక్సిక్ తీర్పు దాదాపు వచ్చేసినట్టే. సోషల్ మీడియా స్పందన చూస్తుంటే టాక్ తాలూకు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో బుక్ మై షోలో కనిపిస్తోంది. యష్ ఇమేజ్ అనే రక్షణ కవచం లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా కిందకు వెళ్ళేది. సాలిడ్ ఓపెనింగ్స్ దక్కేవి కాదు.
ఇక ఇరుముడి విషయానికి వస్తే రాబోయే వీకెండ్ పూర్తిగా రవితేజ కంట్రోల్ లోనే ఉండనుంది. కొత్త రిలీజుల మీద బజ్ లేదు. వచ్చే వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నాయి కానీ ఆడియన్స్ పూర్తిగా ఇరుముడిని వద్దనుకుని వాటికి వెళ్లేంత స్థాయిలో అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఒకవేళ ఇప్పుడీ వారాంతంలో నూటా అరవై కోట్లను కనక ఇరుముడి అందుకుంటే బ్యాలన్స్ నలభై ఇంకో రెండు వారాల్లో లాగేయొచ్చు. థియేటర్ రన్ ఎక్కువ దొరికేలా ఉంది.
రవితేజ కెరీర్ లోనే అత్యధిక నెంబర్లు నమోదు చేస్తున్న ఇరుముడికి ఇంకా పెద్ద వసూళ్లు వచ్చేవి కానీ నిన్న టాక్సిక్ కి ఎక్కువ స్క్రీన్లు కేటాయించడం, విశ్వనాథ్ అండ్ సన్స్ కు మూడో వారం అగ్రిమెంట్లు కొనసాగడం లాంటి కారణాల వల్ల షోల షేరింగ్ తప్పడం లేదు. చాలా బిసి సెంటర్లలో టికెట్లు దొరక్క, ఇరుముడి షోలు సరిపడినంత లేక గొడవలు, ధర్నాలు జరుగుతున్నాయి. మక్తల్ నుంచి ఉప్పల్ దాకా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే మటుకు డబుల్ సెంచరీ పక్కానే.
This post was last modified on August 27, 2026 11:24 am
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…