Movie News

బహుముఖ ప్రజ్ఞాశాలి నారాయణరావు ఇక లేరు

ప్రముఖ నటులు నారాయణరావు కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న చివరి శ్వాస తీసుకున్నారు. 1976 కె బాలచందర్ ‘అంతులేని కథ’తో తెరంగేట్రం చేసిన నారాయణరావు డెబ్యూతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. మరుసటి ఏడాది ‘ఒక ఊరి కథ’తో స్పెషల్ జ్యురి పురస్కారం అందుకోవడం అప్పట్లో సంచలనం. కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, దేవదాస్ కనకాలతో కెరీర్ ప్రారంభంలో నాటకాలు వేసేవాళ్ళు.

మద్రాస్ ఫిలిం ఇన్స్ టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న టైంలో చిరంజీవితో స్నేహం వీళ్ళిద్దరిని మరింత దగ్గర చేసింది. రజినీకాంత్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గుప్పెడు మనసు, ఊరికిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచుపల్లకి, బహుదూరపు బాటసారి లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నారాయణరావు భాగం పంచుకున్నారు. మిత్రుడు చిరంజీవి హీరోగా ఆయన నిర్మించిన ‘దేవాంతకుడు’ కమర్షియల్ గా మంచి విజయం అందుకుంది.

1988లో ఫ్రెండ్స్ ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న చిరంజీవి నారాయణరావుతో పాటు సుధాకర్, హరిబాబుని భాగస్వాములుగా ‘యముడికి మొగుడు’లో నటించారు. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. సుమారు వందకు పైగా చిత్రాల్లో నటించిన నారాయణరావుకు ‘గ్యాంగ్ లీడర్’ లాంటివి మంచి బ్రేక్ ఇచ్చాయి. పసుపు కుంకుమ, గిరిజ కళ్యాణం, సుందరకాండ, గీతాంజలి లాంటి టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెర అభిమానులను కూడా సంపాదించుకున్నారు. నిరాడంబరుడు, సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్నారు.

పలు సందర్భాల్లో నారాయణరావు తను నటుడిగా ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పేవారు. ఇతర ఆర్టిస్టుల్లా వందల సినిమాలు చేయనప్పటికీ ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ తనకు ఎంత ఆప్త మిత్రుడు అయినా ఆ అవకాశాన్ని ఏనాడూ వాడుకునే ప్రయత్నం చేసేవారు కాదు. ఈయన చివరి సినిమా ఆలోచన త్వరలో విడుదల కానుంది. 73 సంవత్సరాల వయసులో నారాయణరావుగారు భౌతికంగా దూరమైనా సినిమాల్లో జీవించే ఉంటారు. 

This post was last modified on August 27, 2026 10:21 am

Share

Recent Posts

సాయిపల్లవిని పెళ్లి చేసుకోవాలంటే…

హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్లో కొన్నేళ్లు గడవగానే కొన్ని డీఫాల్ట్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ పెళ్ళిఎప్పుడు.. మీకు కాబోయేవారికి ఎలాంటి లక్షణాలు…

2 minutes ago

ఆదర్శం మీద అందరి కళ్ళు

సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…

1 hour ago

అనవసరపు రాద్ధాంతం ఇప్పుడు ఎందుకు

సోషల్ మీడియా ఉంది కదాని బురద జల్లే వ్యవహారాలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. ఎంతగా అంటే ఒకరిని లేదా…

2 hours ago

ఇకపై లంచం అడిగితే జైలే

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పనులు జరగడం లేదు. గతంలో రెవెన్యూ, రిజిస్ట్రార్,…

2 hours ago

విభజన ప్రేమకథతో శ్రీకాంత్ ఓదెల సినిమా

దసరాతో తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. న్యాచురల్ స్టార్ గా ఉన్న నానిని ఊర…

6 hours ago

ఆదుకుంటాం… ఏపీకి తెలంగాణ ఆప‌న్న‌హ‌స్తం!

ఏపీ తుపాను సహాయక చర్యలలో సాయం చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. విద్యుత్‌ సిబ్బంది, సామగ్రి పంపేందుకు సిద్ధమైంది.…

6 hours ago