Movie News

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ టీచర్ ని నెగటివ్ గా చూపించారని, అంతే కాకుండా పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు తమ స్కూళ్లలోనే ఉన్నట్టు తప్పు అర్థం వస్తోందని, వీటిని వెంటనే సవరించడమో లేదా తీసేయడమో చేయాలని డిమాండ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రిలీజైన నాలుగు రోజుల తర్వాత ఈ అబ్జెక్షన్ రావడం గమనార్హం. టీమ్ ఇంకా స్పందించలేదు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇందులో తీవ్రంగా తప్పు బట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఇరుముడిలో చూపించింది ఒక చిన్న ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్. అక్కడ జరిగిన కల్పిత ఘటనల ఆధారంగా శివ నిర్వాణ కథ రాసుకున్నారు. అంతే తప్ప రాష్ట్రం మొత్తం స్కూల్ పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడం కాదు డైరెక్టర్ ఉద్దేశం. అది అర్థం చేసుకోకుండా ఇలా వివాదం చేయడం భావ్యం కాదని రవితేజ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇందులో లాజిక్ లేకపోలేదు.

ఉదాహరణకు ఒక పోలీస్ ని విలన్ గా చూపించినంత మాత్రం డిపార్ట్ మెంట్ మొత్తం అలా ఉంటుందని ఎవరూ చెప్పరు. జడ్జీలను సైతం నెగటివ్ షేడ్స్ లో చూపించిన సినిమాలు బోలెడున్నాయి. రాజకీయ నాయకుల సంగతి సరేసరి. అలాంటప్పుడు ఒక టీచర్ ని అలా ప్రొజెక్ట్ చేసినంత మాత్రం మొత్తం వ్యవస్థకు వర్తించదు. ఆ మాటకొస్తే ఈ మధ్య కాలంలో కొందరు కీచక టీచర్లు చేసిన ఘోరాల గురించి మీడియాలో చదువుతున్నాం, చూస్తున్నాం. ఇది అందరికీ తెలిసిందే.

ఇప్పుడీ వివాదం ఇరుముడిని ఇబ్బంది పెడుతుందా అంటే ఆ ఛాన్స్ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు శివ నిర్వాణ నుంచి సహేతుకమైన వివరణ వస్తుందని రవితేజ ఫాన్స్ భావిస్తున్నారు. పైన చెప్పిన లాజిక్స్ వివరించినా చాలు. టాక్సిక్ వల్ల థియేటర్ కౌంట్ తగ్గిపోతుందని ఒకపక్క అభిమానులు టెన్షన్ పడుతున్న టైంలో ఇప్పుడీ టీచర్ కాంట్రావర్సి రావడం ఊహించని పరిణామం. వీటి సంగతి ఎలా ఉన్నా వంద కోట్లు దాటేసి ఇంకో యాభై పైన కన్నేసిన ఇరుముడి అది కూడా సాధించేలా ఉంది. 

This post was last modified on August 25, 2026 11:02 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago