Movie News

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు బాగుండగా తర్వాతి స్థానాల్లో కన్నడ, తమిళం నిలుస్తున్నాయి. అయితే టికెట్ ధరల సందిగ్దత వల్ల ఇరవై నాలుగు గంటల ముందు కూడా ఏపీ తెలంగాణ బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ నిమిషమైనా ఓపెన్ చేస్తారు కానీ కనీసం రెండు మూడు రోజుల ముందే పెడితే రెవిన్యూ పరంగా ప్లస్ అయ్యేదన్న కామెంట్స్ ని కొట్టిపారేయలేం.

ఉదయం అయిదు గంటల నుంచే షోలు మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోందని ట్రేడ్ టాక్. ఇరుముడి చాలా బలంగా ఉన్న టైంలో కేవలం అయిదు రోజుల గ్యాప్ తో టాక్సిక్ రావడం, పెద్ద ఎత్తున థియేటర్లను లాక్ చేసుకోవడం పట్ల సోషల్ మీడియాలో కొంత ప్రతికూలత కనిపిస్తోంది. ఏ భాషా సినిమాకైనా తెలుగు జనాల మద్దతు చాలా కీలకం. విశ్వనాథ్ అండ్ సన్స్, డిసి తమిళనాడు కంటే మన దగ్గర బాగా పెర్ఫార్మ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కెజిఎఫ్ కూడా ఇంతే స్థాయిలో ఆడింది.

మొదటి రోజు ఎంత లేదన్నా ఎనభై నుంచి వంద కోట్ల దాకా టాక్సిక్ గ్రాస్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే టాక్ చాలా కీలకం కానుంది. యానిమల్, పుష్ప, దురంధర్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉందనిపించుకుంటేనే బాక్సాఫీస్ అద్భుతాలు జరుగుతాయి. టీమ్ హైదరాబాద్ తో సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు పూర్తి చేసింది. యష్ తన శాయశక్తులా పబ్లిసిటీలో పాల్గొన్నాడు. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ ప్రతి చోటా కనిపిస్తున్నారు.

టాక్సిక్ కి డైరెక్టర్ బ్రాండ్ ఉపయోగపడటం లేదు. గీతూ మోహన్ దాస్ అవార్డు విన్నింగ్ దర్శకురాలే అయినప్పటికీ కమర్షియల్ సినిమాల పరంగా తను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఏకంగా వందల కోట్ల ప్రాజెక్టు డీల్ చేసే అవకాశం దక్కింది. దీన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారనేది రేపు ఈపాటికి తెలిసిపోతుంది. యష్ డ్యూయల్ రోల్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో నయనతార మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ లో ఆవారాపన్ 2 నెమ్మదించడం టాక్సిక్ కి ప్లస్ కానుంది.  

This post was last modified on August 25, 2026 10:22 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago