Movie News

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత స్టార్ డైరెక్టర్లకు ఒక్క ఫోన్ చేస్తే ప్యాన్ ఇండియా సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న టైంలో యష్ ఈవిడకు ఓకే చెప్పడం అప్పట్లో సంచలనం. ఎందుకంటే గీతూ కమర్షియల్ డైరెక్టర్ కాదు. వందల కోట్ల చిత్రాలు  తీసిన అనుభవమూ లేదు. కానీ ఒక క్లాసిక్ ఫిలిం మేకర్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది. మన టాలీవుడ్ తోనూ కనెక్షన్ ఉంది.

గీతూ మోహన్ ప్రస్థానం చైల్డ్ ఆర్టిస్ట్ గా 1986లో మొదలయ్యింది. మోహన్ లాల్ ‘ఒన్ను ముతల్ పూజ్యం వారే’లో బాలనటిగా పరిచయమయ్యారు. తమిళం సూపర్ హిట్ ‘ఎన్ బొమ్ముకుట్టి అమ్మవుక్కు’లో  టైటిల్ రోల్ పోషించి ఇండస్ట్రీ దృష్టిలో పడ్డారు. 2000 సంవత్సరంలో హీరోయిన్ గా అదే మోహన్ లాల్ సరసన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో మేకప్ వేసుకున్నారు. మరుసటి ఏడాది ఈవీవీ డైరెక్షన్లో వేణు తొట్టెంపూడి సరసన ‘వీడెక్కడి మొగుడండీ’తో పరిచయమయ్యారు. అది ఫ్లాప్.

2009లో ‘కెల్క్కున్నుందో’ షార్ట్ ఫిలిం ద్వారా దర్శకురాలిగా కొత్త అడుగులు వేశారు. 2013 హిందీలో తీసిన ‘లైయర్స్ డైస్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు జాతీయ అవార్డులతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు నోచుకుంది. 2019 ‘మూతన్’కు సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి స్క్రీన్ ప్లేకు గాను గ్లోబల్ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్నారు. గీతూ మోహన్ దాస్ భర్త రాజివ్ రాయ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. అల్లు అర్జున్ నా పేరు సూర్యకు ఆయనే కెమెరా మ్యాన్

ఇంత నేపథ్యంతో గీతూ మోహన్ దాస్ తన టాక్సిక్ కథ చెప్పి యష్ ని ఒప్పించగలిగారు. ఛాయాగ్రహణ బాధ్యతలు రాజీవ్ రాయే నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన గీతూ మోహన్ దాస్ కెరీర్ ఒక ఎత్తు అయితే టాక్సిక్ తో హిట్టు కొడితే ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం మరో మైలురాయవుతుంది. చాలా రిస్క్ అనిపించే ఇలాంటి నిర్ణయం తీసుకున్న యష్ ఆమెలో మేకర్ కి అంత గౌరవం ఇచ్చి నాలుగేళ్లు ఒక్క సినిమాకు ఖర్చు పెట్టాడు. దానికి ఎలాంటి ఫలితం దక్కనుందో రేపు తేలిపోతుంది.    

This post was last modified on August 25, 2026 11:11 am

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago