ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది. ఇప్పటి దాకా క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మూడు టీజర్ వీడియోలను వదలడం తప్పించి సాలిడ్ ప్రమోషన్లు ఇంకా మొదలు కాలేదు. మొన్న జనవరి 12 విడుదల ప్రోమోలు చూశాక అనిల్ రావిపూడినే అడ్వాన్స్డ్ ఉన్నాడనిపిస్తే అది అభిమానుల తప్పు కాదు. ఎందుకంటే ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో చిన్న బడ్జెట్ తో రూపొందుతున్న ఆషామాషీ చిత్రం కాదు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చెప్పిన అక్టోబర్ 2 డేట్ కి వస్తేనే అటుపై వెంకటేష్ మరో మూవీకి మూడు నెలల గ్యాప్ ఉంటుంది. ఇంతకన్నా తగ్గకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల త్రివిక్రమ్ అనుకున్న టైంకి అన్ని పనులు పూర్తి చేయలేకపోతే 2027 సమ్మర్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది పెట్టుబడి పరంగా పెద్ద రిస్కు అవుతుంది. పైగా ఓటిటి డీల్ ముడిపడి ఉంటుంది కాబట్టి అంత సులభంగా నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.
శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆదర్శ కుటుంబం నుంచి ముందు రావాల్సింది తమన్ పాటలు. కాకాకు బాగా ఎలివేషన్లు ఇస్తున్న తమన్ వెంకీ మూవీ గురించి అంతగా సౌండ్ చేయడం లేదు. అంటే టీమ్ నుంచి కాపీ ఎప్పుడు వస్తుందనేది ఇంకా క్లారిటీ లేకపోవడం వల్లే కదా. వెంకీ త్రివిక్రమ్ మొదటిసారి కలయిక కావడంతో ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టేసుకున్నారు. రచయితగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి మేజిక్ చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు.
విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్లు జరుగుతున్న టైంలో కూడా నిర్మాత నాగవంశీ ఎక్కడా ఆదర్శ కుటుంబం ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు ఎందుకని ఊరుకున్నారో లేక ఇంకేదైనా కారణం ఉందేమో చూడాలి. ఒకవేళ వారం పది రోజులు పోస్ట్ పోన్ చేద్దామన్నా అక్టోబర్ పదిహేను జైలర్ 2 లో పెద్ద కాంపిటీషన్ స్వాగతం పలుకుతుంది. అందుకే ఆదర్శ కుటుంబం ఏకె 47 కనక గాంధీ జయంతికే వచ్చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు. లేదంటే మాత్రం పెద్ద చిక్కే వస్తుంది.
This post was last modified on August 24, 2026 6:35 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…