కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభని పూర్తి స్థాయిలో పరిచయం చేసి హనుమాన్ దాకా తీసుకెళ్లింది కూడా ఈ మూవీనే. హీరో తేజ సజ్జ కు కోరుకున్న బ్రేక్ అయ్యింది. అప్పటిదాకా కేవలం హాలీవుడ్ కే పరిమితమైన జాంబీలను రాయలసీమకు తీసుకొచ్చే వెరైటీ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. రీజనబుల్ బడ్జెట్ లో తీయడం చాలా ప్లస్ అయ్యింది. ఇదంతా అయిదు సంవత్సరాల వెనుకటి ముచ్చట.
ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్ రెడీ కాబోతోంది. నెంబర్ టూ బదులు నెక్స్ట్ లెవెల్ అంటూ నామకరణం చేసి ఇవాళ కాన్సెప్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. కథేంటో చెప్పలేదు కానీ ఎలా ఉండబోతోందో క్లూస్ ఇచ్చారు. రాయలసీమలో మొదలైన జాంబీ వైరస్ హైదరాబాద్ వచ్చి కోట్లాది జనాలకు తగులుకుంటుంది. అప్పుడు జరిగే విధ్వంసం నుంచి నగరాన్ని హీరో ఎలా కాపాడాడనే పాయింట్ మీద రూపొందనుంది. తేజ సజ్జతో పాటు ఈసారి కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ మిషన్ లో భాగం పంచుకోబోతున్నాడు.
సృష్టించింది ప్రశాంత్ వర్మే అయినా దర్శకత్వం మాత్రం రానా నాయుడు ఫేమ్ సుపర్న్ ఎస్ వర్మకు ఇచ్చారు. గౌరా హరి సంగీతం సమకూరుస్తుండగా షనాయా కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అంటే మెయిన్ క్యాస్టింగ్ లో చాలా మార్పులే జరిగినట్టు ఉన్నాయి. వీడియోలో ఎలాంటి ఏఐ వాడలేదని హింట్ ఇవ్వడం ద్వారా సోషల్ మీడియా అనుమానాలకు ముందే చెక్ పెట్టినట్టు అయ్యింది. విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ యానిమేషన్ ఇంకొంచెం మెరుగ్గా ఉండాల్సింది.
వచ్చే ఏడాది విడుదల కాబోతున్న జాంబీ రెడ్డి నెక్స్ట్ లెవెల్ కు డేట్ ఫిక్స్ చేయలేదు. గతంలో 2027 సంక్రాంతి అనుకున్నారు ఇప్పుడా ఛాన్స్ లేదు. రాజా సాబ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తేజ సజ్జ మీద ఈ సినిమాతో పాటు మిరాయ్ 2ని తెరకెక్కిస్తూ మంచి పెట్టుబడులు రాబట్టుకుంటోంది. ఇవి కనక సక్సెస్ అయితే మళ్ళీ పునర్వైభవం పొందొచ్చనే నమ్మకంతో ఉంది. చూస్తుంటే మిరాయ్ 2 ముందు విడుదలైనా ఆశ్చర్యం లేదు
Gulte Telugu Telugu Political and Movie News Updates