Movie News

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్ లో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు కోలుకున్నారని, ఇంకొంచెం వర్కౌట్స్ తో పాటు మందులు వేసుకుంటే ఇంకా త్వరగా మాములు మనిషి అవుతారని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పటికే బ్రేక్ వల్ల ఎన్బికె 111 వెయిటింగ్ లో ఉంది. ఆర్టిస్టుల డేట్లు వృథా కావడంతో మళ్ళీ సెట్ చేసే పనిలో దర్శకుడు గోపీచంద్ మలినేని బిజీగా ఉన్నారు.

ఏ తేదీ నుంచి బాలయ్య వస్తారనేది ఇంకొద్ది రోజుల్లో వెల్లడి కానుంది. ఇదిలా ఉండగా విడుదల విషయంలో యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుని డిసెంబర్ 24 రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయట. ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఇరవై రోజుల స్పేస్ దొరుకుతుంది. అది కూడా ఎలాంటి చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకుండా.

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ఆ స్పేస్ చాలు. ఓవర్సీస్ పరంగా చూసుకుంటే షారుఖ్ ఖాన్ కింగ్, అవెంజర్స్ డూమ్స్ డే నుంచి కొంత ఇబ్బందులు తలెత్తినా బాలయ్య టార్గెట్ లోకల్ మార్కెట్లే కాబట్టి టెన్షన్ పడాల్సిన పని ఉండదు. అసలే సంక్రాంతి చాలా ప్యాక్ అయిపోయింది. చిరంజీవి కాకా, వెంకటేష్ జనవరి 12 విడుదల, శర్వానంద్ జార్జ్ క్రిష్, ప్రశాంత్ వర్మ మహాకాళి, సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు పక్కా డేట్లు వేసుకుని మరీ కాచుకుని ఉన్నాయి.

అంతా సవ్యంగా జరిగితే రవితేజ శ్రీవిష్ణు మల్టీస్టారర్ కూడా సంక్రాంతికే వస్తుంది. ఇన్ని సినిమాల మధ్య ఎన్బికె 111 వేసుకోవడం కంటే సోలోగా క్రిస్మస్ కు వచ్చేయడం ఉత్తమం. ఫ్యాన్స్ పండగే కావాలని డిమాండ్ చేస్తారు కానీ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా అవసరం. ఎంత హిట్ అయినా వీరసింహారెడ్డి, గౌతమిపుత్రశాతకర్ణి వాటి ఫుల్ పొటెన్షియల్ ని పోటీ కారణంగా చూపలేదనేది ట్రేడ్ అభిప్రాయం. మరి ఎన్బికె 111 బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

This post was last modified on August 23, 2026 5:29 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

7 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

9 hours ago