మాస్ రాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఆయన కొత్త సినిమా ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి ఫలితాన్నే అందుకుంది. బంపర్ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లే.
ఈ ఉత్సాహంలో తన కొత్త చిత్రం ‘ఖిలాడి’ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవి రేసులో నిలబెట్టారు. సంక్రాంతి కానుగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి వేసవి విడుదలను ఖరారు చేశారు.
ఈ సందర్భంగానే ‘ఖిలాడి’ హీరోయిన్ల లెక్క కూడా తేలిపోయింది. మాస్ రాజా సరసన ఇద్దరు హాట్ బ్యూటీస్‌ను తీసుకున్నాడు రమేష్ వర్మ. ఆ ఇద్దరు.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి.
మీనాక్షి చౌదరి ఉత్తరాది అమ్మాయి. రెండేళ్ల కిందట ‘ఫెమీనా మిస్ గ్రాండ్’ పోటీల్లో విజేతగా నిలిచింది. మోడలింగ్‌లో మెరుపులు మెరిపించిన ఈ అమ్మాయి.. ఇప్పటికే తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఆ చిత్రమే.. ఇచట వాహనములు నిలపరాదు. సుశాంత్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ముగింపు దశలో ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే మీనాక్షి టాలెంట్ తెలిసి ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. మీనాక్షి మోడల్‌గా ఉన్నప్పటి ఫొటో షూట్లు చూస్తే ఆమె సూపర్ హాట్ అన్న సంగతి తెలుస్తుంది. ఇక మరో భామ డింపుల్ హయతి గురించి చెప్పాలంటే ‘గద్దలకొండ గణేష్’ దగ్గరికి వెళ్లాలి.
ఆ చిత్రంలో సూపర్ హిట్టు నీ హైటు అంటూ మంచి మాస్ ఐటెం సాంగ్ చేసింది ఈ భామ. అందులో డింపుల్ ఎంత హాట్‌గా కనిపించిందో, ఆమె స్టెప్పులు ఎంతగా అలరించాయో తెలిసిందే. మొత్తానికి మాస్ రాజా సరసన ఇద్దరూ హాట్ భామల్నే తీసుకున్న రమేష్ వర్మ.. ఈ మాస్ సినిమాలో వాళ్ల అందాల్ని ఎలా ఎలివేట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on January 14, 2021 12:38 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…