టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి సీన్లు గత రెండు మూడు నెలల్లో చాలానే జరిగాయి కానీ ఇప్పుడు స్పెషల్ గా చెప్పుకోవడానికి కారణం ఉంది. మాస్ మహారాజా రవితేజ ఎంత కాలంగా హిట్టు లేకుండా లాక్కొస్తున్నాడో తెలిసిందే. డీసెంట్ కంటెంట్ చేసినా, ఏదైనా ఎక్స్ పరిమెంట్లు ట్రై చేసినా ఫలితం మారలేదు. ఈగల్ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి దాకా అన్నింటిదీ ఒకే కథ.
సమస్య రవితేజలో లేదు. కథ నచ్చి కాంబో ఓకే అనిపిస్తే చాలు వేగంగా చేస్తున్నాడు. హీరో వల్ల డిలే అయ్యిందనే మాట ఇప్పటిదాకా తన కెరీర్ లో లేదు. ఎటొచ్చి దర్శకులకే మాస్ రాజాని హ్యాండిల్ చేయడానికి రావడం లేదు. తన మీద ఎలాంటి సబ్జెక్టులు పడితే వర్కౌట్ అవుతాయో గుర్తించకపోవడం వల్ల చాలా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అభిమానుల ఆవేదన వర్ణనానీతం. అప్ కమింగ్ హీరోలు సైతం సూపర్ హిట్లు కొడుతున్న ట్రెండ్ లో రవితేజ వెనుకబడిపోవడం బాధే.
ఇప్పుడు ఇరుముడి సరైన దారి చూపించినట్టయ్యింది. ఇదేమి అదిరిపోయే కనివిని ఎరుగని కథ కాదు. గతంలో వేర్వేరు రూపాల్లో చూసిందే. కాకపోతే దర్శకుడు శివ నిర్వాణ వాటిని తెలివిగా బ్లెండ్ చేసిన విధానం జనాలకు కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా అయ్యప్ప మాల సెంటిమెంట్ ని మిక్స్ చేసి కూతురి ఎమోషన్ తో పాటు రివెంజ్ డ్రామాని సెట్ చేసిన తీరు ప్రేక్షకులకు నచ్చేసింది. దాని ఫలితంగానే రివ్యూలు, పబ్లిక్ టాక్ మద్దతు ఇస్తున్నాయి. అందుకే ఈ వసూళ్లు.
రవితేజకు ఒక క్లారిటీ వచ్చేసింది. తన ఎంపికలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో, ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో ఇరుముడి పాఠం నేర్పించింది. నెక్స్ట్ శ్రీవిష్ణుతో కలిసి హసిత్ గోలి దర్శకత్వంలో చేయబోయే మల్టీ స్టారర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో మైత్రి నిర్మించే మూవీ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని స్టోరీ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. ఇరుముడిన టెంపో ఇకపై కెరీర్ లో కూడా కొనసాగాలంటే కంటెంట్ ఎలా ఉండాలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates