Movie News

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల మెయిన్ థియేటర్లలో ఆదివారం వరకు అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్లన్నీ అమ్ముడుపోతున్నాయని ట్రేడ్ రిపోర్ట్. చాలా అంటే చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు ఇలాంటి వాతావరణం చూస్తున్నామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధమాకాకు కూడా కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందేమో కానీ ఇరుముడికి అసలా సమస్యే లేదన్నట్టు ఉంది.

ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాటకు థియేటర్లు ఊగిపోతున్నాయి. అయ్యప్ప మాల సీజన్ ఇంకా ప్రారంభం కానప్పటికీ ఏళ్ళ తరబడి ఆ దీక్షను తీసుకుంటున్న వాళ్ళు, త్వరలో మాల ధరించే వాళ్ళు ఈ సాంగ్ కి విపరీతంగా కనెక్ట్ అయిపోయి హాలులోనే పూలు జల్లి డాన్సులు చేస్తున్నారు. ఈ దృశ్యం హైదరాబాద్ విమల్, సంధ్య థియేటర్లకు మాత్రమే పరిమితం కాలేదు. కరీంనగర్ నుంచి కర్నూలు దాకా అన్ని చోట్ల ఒకటే సీన్. పాట రావడం ఆలస్యం కుర్చీలో ఎవరూ ఉండటం లేదు.

పైగా దీనికి ఫాలోఅప్ గా పెట్టిన ఛేజుకు సైతం ఈ సాంగ్ పెట్టడం మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఇరుముడి ఓపెనింగ్స్ లో టైటిల్, రెండు అయ్యప్ప పాటలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే దైవ మహిమలతో సంబంధం లేని ఒక క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్ లో చాలా తెలివిగా అయ్యప్ప మాల అంశాన్ని డిజైన్ చేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ ట్విస్టులను అల్లుకోవడంలో చూపిన నేర్పరితనం ఆడియన్స్ ని మెప్పిస్తోంది.

వీకెండ్ వరకు ముత్యాల పల్లకితో ఇరుముడి హాళ్లు హోరెత్తిపోవడం ఖాయం. కొన్ని చోట్ల రిపీట్స్ కూడా వేశారని సమాచారం. రవితేజ ఫ్యాన్స్ ఇదంతా చూస్తూ యమా హ్యాపీగా ఉన్నారు. తొలి రోజు పెద్ద నెంబర్ వచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో అత్యధిక శాతం ఇరుముడి పాటల రీల్స్ తోనే నిండిపోతున్నాయి. సినిమా ఎలా ఉందనే దానికన్నా ఈ సాంగ్ కి థియేటర్ లో వచ్చే వైబ్ కోసం ఖచ్చితంగా వెళ్లాలనిపించేలా బాగా వైరల్ చేస్తున్నారు. ఏదైతేనేం అందరూ హ్యాపీస్.

This post was last modified on August 21, 2026 10:15 pm

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

5 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

30 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

59 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago