వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు సునీతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తన సోదరుడు జగన్ హయాంలో తనకు న్యాయం జరగలేదని ఆమె పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇక, ఏకంగా తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు చేసిన ఆమె…జగన్ పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డికి మరో షాక్ తగిలింది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకు కొద్ది రోజుల ముందు జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈడీ నోటీసులిచ్చింది. వివేకా మర్డర్ కు ముందు జరిగిన రూ.40 కోట్ల డీల్ పై ఈడీ ఫోకస్ చేసింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఏ-7గా, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏ-8గా ఉన్నారు. త్వరలో భాస్కర్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులిచ్చి విచారణ జరిపే అవకాశాలున్నాయి.
ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలను ఈడీ అధికారులు ఆల్రెడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఆ నలుగురిని పలు అంశాలపై ప్రశ్నించిన తర్వాత అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చిన వైనం చర్చనీయాంశమైంది. అయితే, ఈడీ విచారణకు అవినాష్ రెడ్డి హాజరువుతారా? ఒకవేళ హాజరైతే ఏం చెబుతారు? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
This post was last modified on October 2, 2026 2:50 pm
ఉద్యోగుల పని పరిస్థితులు, వారి ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హోటళ్లు,…
రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్‌పీ) అధ్యక్షుడు వి. విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్…
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…