వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమాకు ‘జనవరి 12 విడుదల’ టైటిల్ లాక్ చేయడం పట్ల అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ట్యాగ్ లైన్ గా ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అని పెట్టడం ఇద్దరు హీరోల అభిమానులను బ్యాలన్స్ చేయడం కోసమేననే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. దానికి తోడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం వచ్చిన వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’ స్టయిల్ ని ఎంచుకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి అనిల్ రావిపూడి ఇదంతా ముందే ఊహించారని ఇన్ సైడ్ టాక్. గతంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనౌన్స్ చేసినప్పుడు ఇదే జరిగింది. చిరంజీవి సినిమాకు ఇలాంటి పేరేంటని సోషల్ మీడియాలో కొంత హడావిడి జరిగింది. కట్ చేస్తే సంక్రాంతికి మూడు వందల కోట్లు వచ్చేశాయి. అంతకు ముందు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని వెంకటేష్ మూవీకి నామకరణం చేసినప్పుడూ ఇదే జరగడం గుర్తు చేసుకోవచ్చు. అది ఏ స్థాయి విజయమో చెప్పనక్కర్లేదు. ట్రిపుల్ సెంచరీ కొట్టింది.
ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ పాట పల్లవి మొదటి లైన్ తీసుకుని మహేష్ బాబు టైటిల్ గా పెట్టడం సాధారణంగా ఎవరూ ఊహించరు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’కి ఆ పేరు చాలా యాప్ట్ అనిపించింది. ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు. సో ఇప్పుడు జనవరి 12 విషయంలో కూడా అనిల్ అదే ధీమాగా ఉన్నారని సన్నిహితుల మాట. మొదట ఎలాంటి నెగటివిటీ వచ్చినా పట్టించుకోనవసరం లేదని, ఫైనల్ గా కంటెంట్ మాట్లాడుతుందని, అందుకే వెంకటేష్ సపోర్ట్ చేశారని అంటున్నారు.
ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా జనవరి 12 విడుదలకు కాంపిటీషన్ చాలా భారీగా ఉండబోతోంది. మెగా 158, సంబరాల ఏటిగట్టు, మహాకాళి, రవితేజ- శ్రీవిష్ణు, శర్వానంద్ జార్జ్ క్రిష్, రజనీకాంత్ ధర్మన్ తో పాటు మరికొన్ని సినిమాలు పండగ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ లో కనక బాలయ్య 111 రాకపోతే అది కూడా జై సంక్రాంతి అంటుంది. ఇలాంటి సందర్భాలు అనిల్ రావిపూడి ఫేస్ చేశాడు కానీ ఈసారి టైట్ అయ్యేలా ఉంది. ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో పండాల్సిందే.
This post was last modified on August 20, 2026 8:15 am
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…