సోషల్ మీడియాలో, పరిశ్రమలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ రేట్ల జిఓ మీద పెద్ద చర్చ జరుగుతోంది. ప్రీమియం వసతులు ఉన్న సింగల్ స్క్రీన్లలోనూ మల్టీప్లెక్సులతో సమానంగా మూడు వందల రూపాయల టికెట్ పెట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం మూవీ లవర్స్ కి షాక్ కొట్టించింది. ఎందుకంటే హైదరాబాద్ లో అరవై శాతం పైగా సింగల్ స్క్రీన్లు ఈ స్పెషల్ క్యాటగిరీలో వస్తాయి. రిక్లైనర్స్ కానీ సీట్లకు సైతం గరిష్టంగా రెండు వందల యాభై రూపాయల దాకా ఛార్జ్ చేయొచ్చు.
నిజానికి గవర్నమెంట్ చెప్పింది గరిష్టంగా ఎంత పెట్టుకోవచ్చు అనే దాని గురించి. అంతే తప్ప ఖచ్చితంగా ఇంత వసూలు చేయండి అని రూల్ పెట్టడం కాదు. ఉదాహరణకు ఒక కొత్త సినిమాకు డిస్ట్రిబ్యూటర్ టికెట్ మీద 175 ఛార్జ్ చేస్తే చాలనుకుంటే అంతే ఫిక్స్ చేసుకోచ్చు. లేదూ పెద్ద బడ్జెట్, చాలా క్రేజ్ ఉంది అనుకుంటే 250 దాకా వెళ్లొచ్చు. ఇక్కడ పంపిణి వ్యవస్థ తీసుకోబోయే నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డిసైడ్ చేసే రేట్లే నైజాం అంతటా ఉండబోతున్నాయి. వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు పది రోజుల పాటు ఇచ్చే పెంపు వెసులుబాటు సంతోషమే అయినా అదనంగా వచ్చే దాంట్లో ఇరవై శాతం కార్మికుల సంక్షేమ నిధికి జమ చేసే నిబంధనని తూచా తప్పకుండా అమలు చేయబోతున్నారు.
దీని వల్ల బడా, ప్యాన్ ఇండియా సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాగూ మొదటి వారం పది రోజులు హైప్, క్రేజ్ మీద రేట్లు ఎంత ఉన్నా జనాలు లెక్క చేయకుండా చూసేస్తారు కాబట్టి. ఎటొచ్చి మీడియం బడ్జెట్, చిన్న సినిమాలకు చిక్కులు తప్పవు. ఎందుకంటే ఒకవేళ ఎగ్జిబిటర్ టయర్ 2 మూవీకి కూడా ఎలాగూ అనుమతి ఉందని ఎక్కువ రేట్ పెడితే ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు రెవిన్యూ దారుణంగా దెబ్బ తింటుంది. ఇది చాలాసార్లు ఋజువయ్యింది.
హిట్ టాక్ వస్తే ఇబ్బంది లేదు. టయర్ 2 అయినా 3 అయినా ఆడియన్స్ భరిస్తారు. లేదంటే ఇబ్బందే. అయితే చిన్న సినిమాలకు ఖచ్చితంగా తక్కువ రేట్లు పెట్టేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. గతంలో కొందరు నిర్మాతలు 99 రూపాయల టికెట్ పెడితే పరిశ్రమ నుంచే వద్దని ఒత్తిడి వచ్చింది. అలాంటప్పుడు వాటి మనుగడ మరింత కష్టమవుతుంది. రాబోయే నెలల్లో చెప్పుకోదగ్గ రిలీజులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ రేట్ల తాలూకు పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
This post was last modified on August 20, 2026 8:23 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…